100 స్థానాల్లో కేసీఆర్ ప్రచారం, పొన్నాలను ఇంటికెళ్లి ఆహ్వానిస్తా: ఆ 42 కోట్లపై కేటీఆర్ ఇలా

హైదరాబాద్: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంద స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను జీహెచ్ఎంసీ, సిరిసిల్లతోపాటు కామారెడ్డిలో ప్రచారం చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తామని తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా పని చేస్తుందని భావిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అధికారుల బదిలీలను సాధారణ బదిలీలుగా చూస్తామన్నారు. తమకు గతంలో మాదిరిగానే 88 సీట్లు రావచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు. హుజూరాబాద్‌లో కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ గజ్వేల్‌లోనే కాదు.. మరో 50 చోట్ల పోటీ చేసినా అభ్యంతరం లేదన్నారు.

KCR will campaign in 100 constituencies, says KTR; will invite ponnala laxmaiah into BRS

ఇక వైఎస్ షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా.. రాహుల్ గాంధీ, మోడీ ఇక్కడికొచ్చి పోటీ చేసినా బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు కేటీఆర్. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

పొన్నాలను ఇంటికెళ్లి ఆహ్వానిస్తా: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల క్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరతానంటే ఇంటికెళ్లి ఆహ్వానిస్తామని కేటీఆర్ అన్నారు. త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆర్ఎస్‌లో చేరుతారని చెప్పారు. బీజేపీ ఈసారి వంద స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌లో అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్‌లో తన్నుకుంటారని ఎద్దేవా చేశారు.

ఓటుకు నోటు వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే..: 42 కోట్లపై కేటీఆర్
రాష్ట్రంలో ఓట్లను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక నుంచి వందల కోట్లను తెలంగాణకు పంపిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో లంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఇలాంటివి ముందే ఊహించామని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో స్కాంగ్రెస్‌కు నో చెప్పాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో శుక్రవారం రూ.42 కోట్లను ఐటీ శాఖ పట్టుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+