వారికి కెసిఆర్ టిక్కెట్లు ఇవ్వరు, సీనియర్లంతా ఎంపీలుగా పోటీ: రేవంత్ సంచలనం

హైదరాబాద్: తెలంగాణలో పలు రాజకీయ పార్టీల నుండి టిఆర్ఎస్‌లో చేరిన వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలకు కెసిఆర్ టిక్కెట్లు ఇవ్వరని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రె్డి జోస్యం చెప్పారు. కెటిఆర్‌కు పోటీగా ఉంటారనే భావించే నేతలను ఎంపీలుగా పోటీ చేయిస్తారని రేవంత్ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం నాడు హైద్రాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ సీఎం కెసిఆర్‌కు వ్యతిరేకులకు స్థానం ఉండదనే అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు.తెలంగాణ సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు మాత్రమే సంతృప్తిగా ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని కొందరు ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ స్థానాలను మార్చుకొనే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందన్నారు.

 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కెసిఆర్ టిక్కెట్టు ఇవ్వలేదు

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కెసిఆర్ టిక్కెట్టు ఇవ్వలేదు

టిడిపి, కాంగ్రెస్‌తో పాటు టిఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు 2019 ఎన్నికల్లో కెసిఆర్ టిక్కెట్టు ఇవ్వరని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చెప్పారు. టిడిపితో పాటు కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్‌లో చేరిన వారికి టిక్కెట్లు ఇవ్వరని రేవంత్ రెడ్డి చెప్పారు. తనకు పోటీ పడేవారేవారికి టిక్కెట్లు దక్కవని చెప్పారు.

 సీనియర్లకు ఎంపీల టిక్కెట్లు

సీనియర్లకు ఎంపీల టిక్కెట్లు

ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న మంత్రులు ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, హరీష్‌రావులకు వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ఎంపీ టిక్కెట్లను ఇస్తారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. సీనియర్లను రాష్ట్రం నుండి తప్పించేందుకే కెసిఆర్ ఈ ప్లాన్ చేస్తున్నారని రేవంత్ అభిప్రాయపడ్డారు.

ఎర్రబెల్లికి జనగామ టిక్కెట్టు

ఎర్రబెల్లికి జనగామ టిక్కెట్టు

టిడిపి నుండి టిఆర్ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు జనగామ టిక్కెట్టు ఇస్తారని రేవంత్ అభిప్రాయపడ్డారు. పాలకుర్తి నుండి దయాకర్ రావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని ఆయన చెప్పారు. జనగామ నుండి దయాకర్ రావు పోటీచేసేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారని రేవంత్ చెప్పారు.

 బిజెపికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బలం లేదు

బిజెపికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బలం లేదు

రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి బలోపేతం కాదని రేవంత్ రెడ్డి అబిప్రాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలో బిజెపికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు ఊహించుకొంటున్నట్టుగా పెద్ద ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

 కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలి

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలి

2019 ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొంటే ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టిఆర్ఎస్ లో టిడిపిని విలీనం చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణలో టిడిపి మనుగడ సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తే ప్రయోజనమని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+