హ్యాపీ న్యూ ఇయర్ 2021: కేసీఆర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ విషెష్..
కొత్త సంవత్సరం మంచి కలగాలని ఆకాంక్షిస్తారు. గత ఏడాది చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగుతుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా నేతలు కూడా విష్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు మేలు కలుగాలని వారు కోరుకున్నారు.
ప్రజలకు సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలని కోరారు. ఈ మేరకు వారిని దీవించాలని భగవంతుడిని ప్రార్ధించారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్షించారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఏడాది కష్టాలు అన్నింటినీ ఈ కొత్త ఏడాదిలో కోరారు. 2021లో అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని, విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాని వెల్లడించారు.
దేశ ప్రజలకు పవన్ కల్యాణ్ న్యూ ఇయర్ విషెస్ చేశారు. ఆశావహ దృక్పథంతో 2021 నూతన వసంతంలోకి ప్రవేశిస్తున్న ప్రజలందరికీ పవన్ కల్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జనసేన తరఫున ఓ ప్రకటనను విడుదల చేశారు.












Click it and Unblock the Notifications