కేసీఆర్ సతీమణికి అస్వస్థత: యశోద ఆసుపత్రిలో చేరిక..
హైదరాబాద్: సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం యశోద ఆసుపత్రిలో చేర్పించారు.

డాక్టర్ పీవీ రావు ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నారు. గురువారం సీఎం కేసీఆర్ ఆసుపత్రికి వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు హరీశ్ రావు కూడా ఆసుపత్రికి వచ్చారు.వైద్యులు మాట్లాడుతూ.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications
