వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసాయి కూతురుగా కీర్తి ఎందుకు మారింది? తల్లినే చంపాలనే కర్కశత్వం దేనికి?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మాయిలు పెరిగిపెద్దయిన తర్వాత కట్టు తప్పుతున్నారు. సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనలను ప్రేరణగా తీసుకోవడమే కాకుండా సినిమా, సీరియల్స్, సోషల్ మీడియా, ఫేస్‌బుక్, సెల్‌ఫోన్ ప్రభావం ఆడపిల్లల మీద కూడా బాగా పనిచేస్తోంది. విదేశీ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో ప్రపంచంతో పరుగెత్తాలనే ఒత్తిడిలో అనేక తప్పులు చేస్తున్నారు నేటితరం అమ్మాయిలు. ఆధునికత అనే ముసుగులో బంధాలను, అనుబంధాలను తృణప్రాయంగా తీసుసుకుంటున్నారు. బాయ్ ఫ్రెండ్, ప్రేమ, డేటింగ్, పబ్బులు, మద్యం సేవించడం, సిగరెట్ తాగడం వంటివి అమ్మాయిలకు నిత్యకృత్యంగా మారిపోయింది.

 అమ్మాయి కదా అని అతి గారాబం..!తల్లినే హత్య చేసిన కీర్తి..!!

అమ్మాయి కదా అని అతి గారాబం..!తల్లినే హత్య చేసిన కీర్తి..!!


సోషల్ మీడియాలో పరిచయం అయిన అబ్బాయితో రిలేషన్ పెట్టుకోవడం, ఆ అపరిచిత వ్యక్తి కోసం తెగింపు చూపించడం నేటి సమాజంలో ఓ భాగం ఐపోయింది. అలా పరిచయం ఐన అబ్బాయిల కోసం సొంత మనుషులతో పాటు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సైతం చంపడానికి కూడా నేటి తరం అమ్మాయిలు జంకడం లేదు. అంటే నేర ప్రవృత్తి నేటి అమ్మాయిల మీద ఎంతటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏకైక సంతానమని తల్లిదండ్రులు కాస్త గారంబం చేయడం, తాము పడిన కష్టం తమ సంతానం పడకూడదనే భావనతో చేతినిండా డబ్బులు ఇవ్వడం, తగినంత స్వేచ్చ ఇవ్వడంతో కొంత మంది అమ్మాయిలు వందకు వంద శాతం తప్పులు చేస్తున్నారు. అలాంటి జీవితానికి అలవాటు పడిన అమ్మాయిలను తల్లిదండ్రులు మందలించేసరికి ఇగో హర్ట్ అయ్యి చేయ కూడని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

పడుతున్నఅమ్మాయిలు..!!

పడుతున్నఅమ్మాయిలు..!!

ఆధునిక జీవనం పేరుతో అకృత్యాలు..!నేరాలు చేయడంలో మగ వారితో పోటీ పడుతున్నఅమ్మాయిలు..!!
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోకి స్వాగతం పలికే హయత్ నగర్ లోని ద్వారకా నగర్ లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న కీర్తి అనే విద్యార్థి ఘటన నేటి అమ్మాయిల మనోభావాలకు ప్రతిబింబంగా మారింది. అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం, ఆ పరిచయం క్షణాల్లో ప్రేమగా మారడం, నికడలేని ఆ ప్రేమ కోసం అడ్డొచ్చిన ఎవరినైనా అంతం చేయడం నేటి సమాజంలో జరుగుతున్న తంతు. ఇందుకు ఆడా,మగా అనే వ్యత్యాసం లేకుండా కనీసం రెండు పదుల వయసు నిండని వారుకూడా హత్యలకు పాల్పడుతున్నారంటే సమాజంలో నేర ప్రవృత్తి ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్ నుండే ప్రేమలో పడి తల్లి కాబోయి మరో యువకుడి వలలో పడి, వద్దని వారించిన తల్లిని మట్టు బెట్టిన కీర్తి అంత కసాయిగా ఎందుకు మారిందో తెలుకునే ప్రయత్నం చేద్దాం.

 సెకండ్లలో పరిచయం.. నిమిషాల్లో ప్రేమ..!తప్పని చెప్పినందుకు గంటల్లోనే హత్యలు..!!

సెకండ్లలో పరిచయం.. నిమిషాల్లో ప్రేమ..!తప్పని చెప్పినందుకు గంటల్లోనే హత్యలు..!!

కీర్తి తండ్రి శ్రీనివాస్ రెడ్డి వఈత్తి రీత్యా ఓ లారీ డ్రైవర్. తల్లి నీరజ గృహిణి. వీరికి ఒక్కతే కూతురు కీర్తి. తల్లిదండ్రులు అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచారు. మంచి ఉద్యోగం సంపాదిందచి, అమెరికాలో స్థిరపడేలా చూడాలని కలలు కన్నారు. అయితే, సామాజిక పరిస్థితుల ప్రభావంతో ఆ అమ్మాయి ఇంటర్ లోనే ప్రేమ వ్యవహారం నడిపితే గొడవలయ్యాయి. ఇపుడు డిగ్రీ సెకండియర్ లో మరో అబ్బాయితో ప్రేమ పేరుతో తిరుగుతోంది ఆ కూతురు. ఈ విషయం బయటకొస్తే తమ కుటుంబం పరువు బజారున పడుతుందని ఆలోచించి, తప్పు చేయవద్దని కూతురిని మందలించి, ప్రవర్తన మార్చుకొమ్మని హెచ్చరించింది తల్లి నీరజ. అసలు కథ ఇక్కడే మొదలైంది. కీర్తిలో నిద్రిస్తున్న అపరిచితురాలు మేల్కొనడానికి ఈ మందలింపే కారణమయ్యింది.

తప్పును తప్పుని చెప్పడమే తల్లిదండ్రుల నేరమా..!హత్యలకు ఉసిగొల్పుతున్న అక్రమసంబంధాలు..!!

తప్పును తప్పుని చెప్పడమే తల్లిదండ్రుల నేరమా..!హత్యలకు ఉసిగొల్పుతున్న అక్రమసంబంధాలు..!!

దీంతో బాగా కోపం పెంచుకొని, తల్లిని చున్నీతో ఉరి తీసి చంపి శవం ఇంట్లో ఉండగానే ప్రియుడితో మూడు రోజులు గడిపి, తర్వాత కారులో శవాన్ని తీసుకెళ్లి రైలు పట్టాలపై పడుకోబెట్టి, అందరినీ నమ్మించిందంటే, ఆ కూతురు ఎంతటి కసాయో అర్ధం చేసుకోవచ్చు. చివరకు తండ్రినే అందరూ అనుమానించేలా, నీ గొడవల వల్లే తల్లి చనిపోయిందంటూ తప్పుడు నిందలేసి బలిపశువును చేయాలని కూడా చూసింది. కూతురుని అల్లారు ముద్దుగా పెంచినందుకు తల్లి దిక్కు లేని చావు చచ్చింది . కనీసం శవం కూడా సరైన దహన సంస్కారానికి నోచు కోలేదు. ఇక తండ్రి బతికిఉన్న జీవచ్చవంగానే బతకాలి. ఆ క్రిమినల్ కూతురికి కనీసం పదేళ్లు జైలు శిక్ష పడితే మొత్తం ఒక కుటుంబం సర్వ నాశనం అయినట్టే లెక్క. హైదరాబాద్ లో రాత్రి పది గంటల తరువాత ఏదైనా పబ్ లోకి అడుగుపెడితే అర్థం అవుతుంది. చెడును ఒంటపట్టించుకోవడంలో అమ్మాయిలు కూడా అబ్బాయిలను దాటిపోతున్నారని. పిల్లల బాగుకోసం ప్రభుత్వాలను, వ్యవస్థలను నిందించి లాభం లేదు. ఈ సమస్యలకు పరిష్కారం తల్లితండ్రుల చేతుల్లోనే ఉందనే అంశాన్ని గ్రహించాలి.

English summary
When the mother is in the house and kills her, he has to spend three days with the lover and then take the corpse in the car and put it on the rails and trust everyone, so that the daughter can understand how cruel she was.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X