కేరళకు భారీ విరాళం: రూ.25కోట్లు ప్రకటించిన తెలంగాణ, 2.5కోట్ల విలువైన పరికరాలు

Recommended Video

    కేరళకి అన్ని రాష్ట్రా ప్రభుత్వాల నుండి భారీ విరాళాలు

    హైదరాబాద్‌: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు అండగా నిలిచేందుకు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా తెలంగాణా ప్రభుత్వం భారీ విరాళాన్ని ప్రకటించింది.

    ఈ మేరకు తెలంగాణా ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్న కేరళ సోదర సోదరీమణులను అదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొచ్చారని తెలిపారు.

     kerala floods: Telangana Govt contributes rs 25cr relief work

    25కోట్ల రూపాయల భారీ విరాళంతోపాటు, రూ.2.5కోట్ల విలువైన 10 రివర్స్‌ ఓస్మోసిస్ ప్లాంట్లను కేరళకు అందిస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు. అలాగే కేరళ వరద పరిస్థితిపై సీఎం పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

    మరోవైపు కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధికి తమ ప్రభుత్వం తరపున 10 కోట్ల రూపాయల విరాళం అందజేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ మీడియాకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా రూ.5కోట్ల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+