శబరిమలకు వచ్చే భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు..!!

శబరిమలకు వచ్చే భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. మండల-మకరవిళక్కు సీజనులో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. ఇప్పటికే దర్శనాలు ప్రారంభం అయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ బోర్డు.. కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసాయి. ఇదే సమయంలో భక్తుల కోసం అన్ని ప్రధాన మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. ఆరోగ్య పరంగా భక్తులకు కొన్ని సూచనలు చేసింది.

ప్రత్యేక ఏర్పాట్లు
శబరిమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య పరంగా ముందస్తు చర్యలు చేపట్టింది. పలు భాషల్లో మాట్లాడే వైద్యులు... సిబ్బందితో 24 గంటలు పని చేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది. అదే విధంగా యాత్రికులు సైతం కొన్ని సూచనలు పాటించాలని కోరింది. స్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలు అనిపించినా వెంటనే ఆరోగ్య కేంద్రాల నుంచి సాయం తీసుకోవటంలో ఆలస్యం చేయవద్దని కోరింది. అదే విధంగా.. దర్శనంకు వచ్చే సమయంలో రెగ్యులర్ గా వాడే మందులను తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించింది. అదే విధంగా వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్‌ వెంట ఉంచుకోవాలి.

Kerala Government issues latest health advisory for Pilgrims provide medical facilities

ఈ మర్గాల్లో మంచిది
కొంత మంది భక్తులకు అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు ఒకేసారి నడిచి వెళ్లడం అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుందని..దీని కారణంగా యాత్రకు వె ముందే నడక, కొన్ని వ్యాయామాలు ప్రాక్టీసు చేయడం మంచిదిని పేర్కొంది. ఏవరైనా భక్తులకు పూర్తి స్థాయి ఫిట్ నెస్ లేకపోతే కొండ పైన వెళ్లే సమయంలో కొంత నెమ్మదిగా వెళ్లాలని సూచించింది. అవసరమైన సమయంలో ఆగి విశ్రాంతి తీసుకొని ముందుకు వెళ్లాలని సూచన చేసింది. నీలిమల మార్గాన్ని కాకుండా స్వామి అయ్యప్పన్ రహదారిని ఎంచుకోవడం మంచిదని పేర్కొంది. భోజనం చేసిన వెంటనే కొండపైకి ఎక్కడం చేయవద్దని సలహా ఇచ్చింది.

వెంటనే చికిత్స తీసుకోండి
భక్తులకు ఏ సమయంలో అయినా ఎలాంటి వైద్యం సాయం అవసమైనా 04735203232 నంబర్‌కు కాల్‌ చేయలని వెల్లడించింది. అదే విధంగా.. నీలిమల, పంబ, అపచిమేడు, సన్నిధానం ఆస్పత్రుల్లో గుండె సంబంధిత వైద్య పరీక్షలు వంటి సర్వీసులు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. ఇక, యాత్ర సమయంలో ఎవరైనా పాముకాటుకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించి.. అవసరమైన చికిత్స పొందేలా ఏర్పాట్లు చేసారు. శబరిమలలోని ఆరోగ్య కేంద్రాల్లో యాంటీవీనమ్‌, చికిత్సలు కూడా అందుబాటులో ఉంచారు.తీర్థయాత్ర సమయంలో గోరువెచ్చని నీటిని మాత్రమే తాగండి. బహిరంగ ప్రదేశాల్లో విసర్జన చేయవద్దని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+