కేపీ చౌదరి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు: ఆషు రెడ్డి సహా ప్రముఖుల పేర్లు
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో 'కబాలి' తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి అరెస్ట్ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, కేపీ చౌదరి సాగించిన డ్రగ్స్ కొకైక్ దందా.. కొనుగోలు చేస్తున్న వారి జాబితాను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. ఈ జాబితాలో అషూరెడ్డి సహా పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్లు తెలిసింది.
జూన్ 14న డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ చేసిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించారు. కొకైన్ కొనుగోలు చేసిన వారి జాబితా గూగుల్ డ్రైవ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వారి వివరాలు ఫొటోలతో సహా బయటపడ్డాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 మంది సినీ, టీవీ నటులు, మోడల్స్, వ్యాపారులు కూడా ఉన్నారు.

బెజవాడ భరత్, చింతా సాయిప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగూర్ విజ్ అలియాస్ ఠాగూర్ ప్రసాద్ మోటూరి, తేజ చౌదరి అలియాస్ రఘు తేజ, వంటేరు సావన్ రెడ్డి, సనా మిశ్రా, సుశాంత్, నితినేష్, అనురూప్ ఈ జాబితాలో ఉన్నారు. వీరంత స్నేహిత హిల్స్‌లోని సిక్కిరెడ్డి నివాసంలో వేడుకలు చేసుకుంటూ.. కొకైన్ తీసుకునేవారని ఆధారాలు బయటపడ్డాయి.
ఇద్దరు సినీ దర్శకులు, ఇద్దరు నటీమణులు, కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు చెబుతున్నా.. వారి వివరాలు బయటపడలేదు. మరోవైపు, కేపీ చౌదరి నాలుగు సెల్‌ఫోన్లలో వందల మంది ప్రముఖుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వీరిలో సుమారు 20 మందితో 4-5 నెలల నుంచి తరచూ మాట్లాడిన ఫోన్ కాల్స్ వెలుగుచూశాయి.
ఇతడి బ్యాంక్ ఖాతాల్లో రూ. లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు నిర్ధరించారు. గత మే నెలలో కేపీ చౌదరి స్నేహితుడు బెజవాడ భరత్ తో కలిసి బెంగళూరు వెళ్లారు. అక్కడ వీకెండ్ పార్టీ సందర్భంగా.. పెద్ద మొత్తంలో కొకైన్ క్రయ, విక్రయాలపై నిర్ణయం తీసుకున్నారు.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం నివాసి సురేష్ రాజుతో కేపీ చౌదరి ఫోన్ సంభాషణలు జరిపాడు. హనుమకొండకు చెందిన అనురూప్‌తో వందసార్లు ఫోన్లో మాట్లాడాడు. పంజాగుట్టకు చెందిన పుష్పక్ క్యాబ్స్ యజమాని రతన్ రెడ్డి, సినీ నటి ఆషు రెడ్డితోనూ కేపీ చౌదరి అత్యధిక సార్లు ఫోన్లో సంభాషణలు జరిపాడు. హైదరాబాద్‌లోని డాక్టర్ సుధీర్, సినీ నటి జ్యోతి, అమెరికాలో ఉన్న డీ అమర్‌లతో మాట్లాడాడు.
గోవాలోని రెస్టారెంట్ నిర్వాహకుడు మనీష్ షా బ్యాంక్ ఖాతాకు చౌదరి రూ. 85వేలు పంపాడు. ఏపీలోని మంగళగిరికి చెందిన షేక్ ఖాజా బ్యాంక్ ఖాతాలో రూ. 2 లక్షలు, బీహార్‌కు చెందిన కౌశిక్ అగర్వాల్ ఖాతాలో రూ. 16వేలు, విజయవాడకు చెందిన టీ సుజాత బ్యాంక్ ఖాతాలో రూ. లక్ష చొప్పున లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ బ్యాంక్ ఖాతాలను ఎవరు నిర్వహిస్తున్నారు? ఇతరుల పేర్లతో డ్రగ్స్ పెడ్లర్స్ వినియోగిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలువురి పేర్లు బయటపడటంతో ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా, ఆషు రెడ్డి సెలైన్ పెట్టుకున్నట్లు ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని.. త్వరలోనే తిరిగి వస్తానని ఆషు రెడ్డి తెలిపింది. అయితే, ఆమెకు ఏం జరిగిందనే విషయం మాత్రం చెప్పలేదు. మరోవైపు, డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం స్పష్టం చేసింది. తన ఫోన్ ప్రదర్శించకూడదని కోరింద.












Click it and Unblock the Notifications