వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఆర్ఎస్ లో కేసీఆర్ ప్రకాష్ రాజ్ కు కీలక స్థానం ఇస్తారా? ఆసక్తికర చర్చ!!

|
Google Oneindia TeluguNews

రాజకీయంగా సత్తా చాటాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు బిఆర్ఎస్ మంచి అవకాశం ఇస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ ఆ పార్టీలో కీలక భూమిక పోషించనున్నారా? దేశవ్యాప్తంగా సత్తా చాటేందుకు సిద్ధమైన సీఎం కేసీఆర్ పార్టీ, ప్రకాష్ రాజ్ సేవలను వినియోగించుకోనుందా ? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కర్ణాటక మాజీ సీఎంతో కలిసి ప్రకాష్ రాజ్

బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కర్ణాటక మాజీ సీఎంతో కలిసి ప్రకాష్ రాజ్

డిసెంబర్ 9వ తేదీన టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిపోయింది. బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ సీఎం కేసీఆర్ చేశారు. దేశవ్యాప్తంగా సత్తా చాటటానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో రంగంలోకి దిగారు. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తో పాటుగా నటుడు ప్రకాష్ రాజ్ కూడా బీఆర్ఎస్ ఏర్పాటు కార్యక్రమానికి హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది.

బీఆర్ఎస్ లో ప్రకాష్ రాజ్ కు కీలక భూమిక

బీఆర్ఎస్ లో ప్రకాష్ రాజ్ కు కీలక భూమిక

సీఎం కేసీఆర్ ను కలవడానికి, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రకాష్ రాజ్ రావడం కొత్తేమీ కాదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నాడు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తో కలిసి ప్రకాష్ రాజ్ రావడం ఆసక్తికర రాజకీయ సమీకరణాలకు కారణంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ప్రకాష్ రాజ్ కీలక భూమిక పోషిస్తారు అన్న చర్చ జరుగుతుంది.

 అక్కడ ఇంచార్జ్ గా ప్రకాష్ రాజ్ కు అవకాశం ?

అక్కడ ఇంచార్జ్ గా ప్రకాష్ రాజ్ కు అవకాశం ?

ఇప్పటివరకు గులాబి బాస్ తో సన్నిహితంగా ఉన్న ప్రకాష్ రాజ్ కు ఆయన ఎటువంటి కీలక పదవి ఇవ్వలేదు. అప్పట్లో రాజ్యసభ సీటు ఇస్తారని భావించినా , అది కూడా ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం గులాబీ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని భావిస్తున్న తరుణంలో కెసిఆర్ ప్రకాష్ రాజ్ ను కర్ణాటక రాష్ట్రానికి కానీ, తమిళనాడు లేదా మహారాష్ట్రకు కానీ ప్రతినిధిగా నియమించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రానికే ప్రకాష్ రాజ్ కు ఎక్కువ అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

కర్ణాటక లో వచ్చే ఎన్నికల కోసం గులాబీ బాస్ ఫోకస్.. ప్లాన్ ఇదేనా

కర్ణాటక లో వచ్చే ఎన్నికల కోసం గులాబీ బాస్ ఫోకస్.. ప్లాన్ ఇదేనా

బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలను విస్తరించడం కోసం సీఎం కేసీఆర్, ఇతర రాష్ట్రాలకు రాష్ట్రాలవారీగా ప్రతినిధులను నియమించే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రకాష్ రాజ్ కు బిఆర్ఎస్ తరపున కీలక బాధ్యతలు ఇస్తారని చర్చ జరుగుతుంది. మరికొన్ని నెలల్లో కర్ణాటక రాష్ట్రానికి ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ కర్ణాటక రాష్ట్రంలో జెడిఎస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. కుమారస్వామిని సీఎంను చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ కి అక్కడ కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు.

బీఆర్ఎస్ ప్రతినిధిగా ప్రకాష్ రాజ్?

బీఆర్ఎస్ ప్రతినిధిగా ప్రకాష్ రాజ్?

కర్ణాటక రాష్ట్రంలో ప్రకాష్ రాజ్ ను బి ఆర్ ఎస్ ప్రతినిధిగా చేస్తే, రెండు పార్టీల మధ్య సమన్వయానికి ఆయన కృషి చేసే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లో ప్రకాష్ రాజ్ కు కీలక బాధ్యత అప్పగించనున్నట్లు అందరూ భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో, ఈసారైనా ఆయన ప్రకాష్ రాజ్ కు సముచిత స్థానం ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

English summary
There is talk in the political circles that CM KCR will give a key position to Prakash Raj in BRS. In order to focus on Karnataka, there is a discussion that Prakash Raj will be appointed as in-charge there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X