khairatabad ganesh2022: 50అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ పంచముఖ గణనాథుడు; 68ఏళ్ళలో తొలిసారి.. ప్రత్యేకతలివే!!
నేడు వినాయక చవితి కావడంతో దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా వినాయకుని మండపాలను ఏర్పాటుచేసి, గణేశ విగ్రహాలను ప్రతిష్టించి అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రులు జరపడానికి ప్రజలు ఉత్సాహంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ గణేష్ చతుర్థి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

గణేశ చతుర్థి వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తున్న ఖైరతాబాద్ గణేశ విగ్రహం
హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన విగ్రహం ఖైరతాబాద్ గణేశ విగ్రహం ఎప్పుడు గణేశ చతుర్థి వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది . నేటి నుండి ఖైరతాబాద్ గణనాథుడు పూజలందుకోనున్నారు. తొలి పూజకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరవుతారు. ఆ తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఖైరతాబాద్ గణనాథుని పూజలో పాల్గొంటారు. ఇక నగరంలోని భక్తులు నేడు మధ్యాహ్నం నుంచి విగ్రహానికి పూజలు నిర్వహించుకోవచ్చు.
మట్టితో చేసిన 50 అడుగుల ఎత్తైన విగ్రహం శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి
ఇక ఈ సారి ఖైరతాబాద్ గణనాథుని ప్రత్యేకతలు చూస్తే మట్టితో చేసిన 50 అడుగుల ఎత్తైన విగ్రహం శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనం ఇస్తున్నారు. త్రి శక్తి మహాగాయత్రి మరియు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి గణపతికి ఇరువైపులా దర్శనమిస్తారు. 68 ఏళ్లలో తొలిసారిగా ఖైరతాబాద్‌లో ఖైరతాబాద్ విగ్రహాన్ని మట్టితో తయారు చేయడం ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం. జూన్‌లో విగ్రహ తయారీ ప్రారంభించగా, 150 మంది కళాకారులు రూ.1.5 కోట్లతో విగ్రహాన్ని తయారు చేశారు. జనాలకు లక్ష్మీ కటాక్షం కలగాలని ఈసారి పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపం లో ఉన్న ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణనాధుడి విగ్రహం
ఈసారి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో స్వామిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇక 1954వ సంవత్సరంలో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశుడి ప్రస్థానం ఆ తర్వాత ప్రతి ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ సాగుతోంది. మొత్తం ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం 60 అడుగులకు చేరిన తర్వాత 2014లో షష్టిపూర్తి మహోత్సవాన్ని జరిపారు. ఆ తర్వాత మళ్ళీ ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం 50 అడుగుల గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఖైరతాబాద్ గణనాధుడి ప్రత్యేకతలు ఎన్నో
ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రసాదం కూడా ఎప్పుడు భక్తులకు ప్రత్యేక ఆకర్షణ గానే ఉంటుంది. అయితే ఈ సారి ఖైరతాబాద్ గణేషుడి చేతిలో కేవలం బొమ్మ లడ్డు మాత్రమే పెట్టడం ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో లడ్డూ పంపిణీలో జరిగిన తొక్కిసలాట కారణంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వినాయకుడికి 55 అడుగుల జంధ్యం, 50 అడుగుల పై వస్త్రాన్ని ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఈసారి కూడా సమర్పించనుంది. ప్రతి సంవత్సరం అనవాయితీగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం, ఖైరతాబాద్ గణనాథుని కి వస్త్రాలు సమర్పిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగనుంది. ఖైరతాబాద్ గణనాథుడి దర్శించుకోవడానికి భారీగా భక్తులు వచ్చే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుకు తగినట్టుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈసారి ఘనంగా గణేశ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
రెండేళ్లుగా నగరంలో కరోనా మహమ్మారి ఉత్సవాలకు విఘ్నం కలిగించగా ఈ ఏడాది శుభం జరగాలనే ఉద్దేశ్యంతో పంచముఖ మహాలక్ష్మి గణపతిని పూజించి గణేశ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇదిలావుండగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) హైదరాబాద్‌లో భక్తులు తమ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వివిధ ప్రదేశాలలో పోర్టబుల్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ (FRP) వాటర్ పాండ్‌లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. హుస్సేన్ సాగర్ మరియు ఇతర నీటి వనరులలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP) తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది.
నగర వ్యాప్తంగా కృత్రిమ చెరువులను ఏర్పాటు చేస్తున్న జీహెచ్ఎంసీ
ఈ సంవత్సరం నుండి ఇందిరాపార్క్‌లో ఎన్టీఆర్ స్టేడియం, అమీర్‌పేట క్రీడామైదానంలో రెండు ఎఫ్‌ఆర్‌పీ చెరువులను ఏర్పాటు చేస్తున్నారు. వారం చివరి నాటికి నగరవ్యాప్తంగా ఇలాంటి 24 కృత్రిమ పాండ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఎఫ్‌ఆర్‌పీ చెరువుల వద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని జిహెచ్ఎంసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications