హీరోయిన్ ఛాన్స్ కోసం అలా చేయాల్సిందేనన్నాడు: పూరి అసిస్టెంట్ పేరుతో దారుణం..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినిమాల్లో 'ఒక్క ఛాన్స్' అంటూ ఫిలింనగర్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగే యువతకు కొదువలేదు. అమ్మాయిలూ అంతే.. ఎన్నో కలలతో ఇక్కడ అడుగుపెడుతారు కానీ.. తీరా అసలు విషయం అర్థమయ్యాక మధ్యలోనే డ్రాప్ అయ్యేవాళ్లు చాలామంది ఉంటారు. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయి.. తాము మోసపోయామన్న నిజాన్ని గ్రహించి నిస్సహాయులుగా మిగిలిపోతారు.

తాజాగా ఖమ్మం జిల్లా రాఘవపురంకు చెందిన కృష్ణవేణి అనే అమ్మాయి ఇలాగే మోసపోయింది. సినిమాల్లో హీరోయిన్ కావాలన్న ఆమె కోరికను ఆసరాగా చేసుకుని శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి ఆమెను మోసగించాడు. సినిమాల్లో అవకాశం ఇస్తానని, తాను పూరి జగన్నాథ్ అసిస్టెంట్ అని డబ్బులు డిమాండ్ చేశాడు. నిజమేననుకున్న కృష్ణవేణి.. అడిగినంతా ముట్టజెప్పింది.

khammam woman complaint against a film distributor at jublihills police station

డబ్బయితే ముట్టింది గానీ.. తనకు మాత్రం ఏ అవకాశం రాకపోవడంతో మరోసారి అతన్ని గట్టిగా నిలదీసింది. దీంతో డబ్బు ఒక్కటే కాదు.. కమిట్‌మెంట్ కూడా కావాలని వక్ర భాష్యం చెప్పాడు శ్రీనివాస్. అదేంటని నిలదీస్తే.. తనతో ఏకాంతంగా గడపాలని మెలిక పెట్టాడు. అందుకు కృష్ణవేణి అంగీకరించలేదు. మోసపోయానని గ్రహించి తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాల్సిందిగా విక్కీని కోరింది.

శ్రీనివాస్ మాత్రం ఆమె నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో కృష్ణవేణి పోలీసులను ఆశ్రయించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విక్కీ వ్యవహారంపై ఫిర్యాదు చేసింది. విక్కీ అనే వ్యక్తి ద్వారా శ్రీనివాస్ పరిచయమైనట్లు తెలిపింది. మరోవైపు దీనిపై స్పందించిన శ్రీనివాస్ మాత్రం తనపై ఆరోపణలను ఖండించాడు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదని అన్నాడు. తాను చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటానని తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young woman from Khammam was complainted against a film distributor for cheating her on the name of movie opportunities.
Please Wait while comments are loading...