ఛానల్‌ ఎండీని కిడ్నాప్‌ చేయబోయి! బాలుడి అపహరణ: అరెస్ట్

హైదరాబాద్‌: సెప్టెంబర్ 12న ఎల్బీనగర్‌లో జరిగిన బాలుడి కిడ్నాప్‌ కేసును పోలీసులు చేధించారు. మంగళవారం ఎల్బీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నలుగురు నిందితులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా కేసు వివరాలను డీసీపీ ఇక్బాల్‌ తెలిపారు. నిందితులు ముందుగా ఓ ఛానల్‌కు చెందిన ఎండీ స్థాయి వ్యక్తిని కిడ్నాప్‌ చేయాలని పథకం వేశారని.. అది విఫలం కావడం వల్లే బాలుడిని అపహరించారని వెల్లడించారు.

అపహరణ సమయంలో నిందితుల జేబు నుంచి సెల్‌ఫోన్‌ జారిపడిందని.. దాని ఆధారంగా పోలీసులు పట్టుకుంటారన్న భయంతోనే బాలుడిని స్వచ్ఛందంగా విడిచిపెట్టినట్లు డీసీపీ తెలిపారు.

కిడ్నాప్‌ వెనుక నిందితులకు ఎలాంటి ఉద్దేశాలు లేవని కేవలం డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతోనే కిడ్నాప్‌కు పథకం వేశారని వెల్లడించారు. కాగా, బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు సోమవారమే అరెస్టు చేశారు.

 Kidnappers were kidnapped a child instead of a Channel MD

ఆస్పత్రిలో మాయమైన శిశువు ఆచూకీ లభ్యం

ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సెప్టెంబర్ 9న అదృశ్యమైన మగ శిశువు ఆచూకీ లభ్యమైంది. ఖమ్మం జిల్లాలోని నెల్లిపాకలో ఓ మహిళ శిశువును వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఆమె వ్యవహారంపై అనుమానం వచ్చిన వైద్యులు ఆమెను ప్రశ్నించారు.

మహిళ చెప్పిన వివరాల ప్రకారం.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అపహరణకు గురైన శిశువుగా నిర్దారించుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన రాధా అనే మహిళ సెప్టెంబర్ 8న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మగబిడ్డను ప్రసవించింది.

అనంతరం చికిత్సలో భాగంగా బాబును ఇంక్యూబేటర్‌లో ఉంచిన వైద్యులు మూడు గంటలకోసారి తల్లి వద్దకు పాల కోసం తీసుకెళ్లారు. 9న అర్ధరాత్రి అయినా బిడ్డను తీసుకు రాకపోవడంతో తల్లి నిలదీసింది. దీంతో శిశువు అపహరణకు గురైన విషయం బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+