బెదిరింపు కాల్స్: గవర్నర్‌ని కలిసిన మాజీ ఎంపీ(పిక్చర్స్)
హైదరాబాద్:మాజీ ఎంపీ అంజన్ కుమార్‌యాదవ్‌కు చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన శనివారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. తనకు 15 రోజులుగా చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా హతమారుస్తామంటూ కాల్స్ వస్తుండడంతో పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లానని, కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఈ క్రమంలోనే గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌కి గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ బెదిరింపు కాల్స్ చేసినవాళ్ళు అంజన్‌కుమార్‌ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. దాంతో అంజన్ హాడలిపోయిన కుమార్ యాదవ్ హుస్సేనీ ఆలం పోలీసులకు ఆగస్టు 31న ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలా, వద్దా అనే సందేహాన్ని తీర్చుకోవాడనికి పోలీసులు నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేయాలని కోర్టు ఈ నెల 5వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసిన పోలీసులు అంజన్ కుమార్ యాదవ్‌కి బెదిరింపు కాల్స్ ఎక్కడినుంచి వస్తున్నాయన్న అంశం మీద దర్యాప్తు ప్రారంభించారు.
అంజన్ కుమార్ యాదవ్ ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయపై ఓడిపోయిన విషయం తెలిసిందే.

అంజన్‌కుమార్‌కి చంపేస్తామంటూ ఫోన్లు, ఫిర్యాదు
తనని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ రావడంతో గవర్నర్ నరసింహన్‌ని కలిసి వినతిపత్రం అందచేసిన తర్వాత రాజ్ భవన్ నుండి బయటకు వస్తున్న అంజన్ కుమార్ యాదవ్.

గవర్నర్ నరసింహన్‌ని కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం... రాజ్ భవన్ బయట విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

అంజన్‌కుమార్‌కి చంపేస్తామంటూ ఫోన్లు, ఫిర్యాదు
గవర్నర్ నరసింహన్‌ని కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం... రాజ్ భవన్ బయట విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

Click it and Unblock the Notifications