కారులో కిమ్స్ ఉద్యోగి శవం, మద్యం బాటిళ్లు కూడా: హత్యా, ఆత్మహత్యా?
హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో బీఎండబ్ల్యూ కారులో మృతదేహం కనిపించింది. ఆ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించిందియ మృతుడు కిమ్స్ ఆస్పత్రి వైద్యుడు రాఘవేందర్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతుడు గుండెపోటుతో చనిపోయాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారులో మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుటుబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాఘవేందర్ ఫోన్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదని అంటున్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతుడు మద్యం సేవించి, గుండెపోటుతో మరణించి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ అతనిది ఆత్మహత్యనా, హత్యానా, సహజమరణమా అనేది తెలియదని అంటున్నారు.


Click it and Unblock the Notifications