ఎంతో ఎత్తుకు ఎదిగిన కిన్నెర మొగిలయ్య.!మీడియా వాళ్ల ఫోన్లను ఖాతరు చేయని వైనం.!
హైదరాబాద్ : ఒక్క ఉపాయం జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య జీవితం కూడా సినిమాటిక్ గా ఊహించని మలుపులు తిరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక్క అవకాశం మొగిలయ్య జీవితాన్నే మార్చేసింది. 24గంటల్లో ఒక్కసారి కూడా మోగిందో లేదో తెలియని మొగిలయ్య ఫోన్ ప్రస్తుతానికి మాత్రం నిమిషానికి ఓ సారి మోగుతోంది. ప్రధానంగా మీడియా రంగానికి సంబంధించిన అనేక మంది మొగిలయ్య ఇంటర్వ్యూ కోసం ఆయనకు కాల్ చేస్తుండడం అత్యంత సాధారణ అంశం.

మొగిలయ్యది అమాయకత్వమా.?
పవన్ కళ్యాణ్ సినిమాలో పాట పాడి రెండు తెలుగు రాష్ట్రాలకు సెలెబ్రిటీ ఐన మొగిలయ్య, పద్మశ్రీ రావడంతో జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అధికార నివాసంలో సన్మానించి కోటి రూపాయల నజరానాతో పాటు ఇంటి స్థాలాన్ని కూడా మంజూరు చేయడంతో మొగిలయ్యకు స్టార్ హోదా వచ్చింది. ఇంత వరకూ బాగానే ఉన్నా అకస్మాత్తుగా తనకు వస్తున్న ఫోన్ కాల్స్ పట్ల మొగిలయ్య ఆగ్రహంగా వ్యవహరించడం ఆశ్యర్యానికి గురిచేస్తోంది.

జీవితాన్ని మార్చేసిన భీమ్లా నాయక్ పాట..
నగరం శివార్లలోని సింగరేణి కాలనీలో నివాసం ఉండే మొగిలయ్య పవన్ కళ్యాణ్ సినిమాలో పాట పాడేంత వరకూ ఎవ్వరికీ తెలియని వ్యక్తి. ఆయనలో ఉన్న అరుదైన కళను గుర్తించి అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ మొగిలయ్యను సెలెబ్రిటీని చేసారు. మొగిలయ్య వాయిస్తున్న వాయిద్యం, కళ అత్యంత అరుదైంది కావడంతో మీడియా బాగా ఫోకస్ పెట్టింది. మొగిలయ్య కళ పట్ల బాగా ప్రాచూర్యం కల్పించింది. దాంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

చికాకు పడితే ఎలా మొగిలయ్య గారూ..
అంతే కాకుండా తెలంగాణ సీఎం పద్మశ్రీ అవార్డు గ్రహితలను గౌరవించే క్రమంలో కోటి నగదును, ఇంటి స్ధాలాన్ని కేటాయించారు. ఈ అనుభూతులను పంచుకోవాలని సూచిస్తూ మొగిలయ్యకు ఫోన్ చేస్తుంటే ఖాతరు చేయని వైనం మీడియా మిత్రులను ఖంగు తినిపించేలా చేస్తోంది. అదే మొగిలయ్య మీడియా వాళ్లు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ఎదురు చూసిన సందర్బాలనుండి ఎందుకు ఫోన్ చేస్తున్నారనే స్ధాయి వరకూ ఎదిగాడు. మొగిలయ్య వైఖరి సరిగా లేదని కొంత మంది మీడియా మిత్రులు అసహనం వ్యక్తం చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి.

పవన్ కళ్యాన్ ఉన్నత వ్యక్తిత్వం..
మొగిలయ్యను వెలుగులోకి తెచ్చింది పవన్ కళ్యాణ్ అనే ఉత్తమ వ్యక్తిత్వం గల వ్యక్తి అనే అంశాన్ని మొగిలయ్య మర్చిపోవద్దు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం, ఎదుటి వారి మనోభావాలను గౌరవించడం పవన్ కళ్యాణ్ మొదల ఉన్నత లక్షణం. అంతటి ఉత్తమ విలువలు ఉన్న వ్యక్తి ద్వారా కీర్త ప్రతిష్ఠలు పొందిన మొగిలయ్య మరింత హుందాగా వ్యవహిరిస్తే సమంజసంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications