హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ఈరోజు ఉంటారు.. రేపు పోతారు: వాటిని అవమానించొద్దంటూ కిషన్ రెడ్డి ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీం కేసీఆర్‌కు వ్యవస్థలంటే గౌరవం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజపేయికి నివాళులర్పించారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ ఈరోజు ఉంటారు.. రేపు పోతారు కానీ..: కిషన్ రెడ్డి

కేసీఆర్ ఈరోజు ఉంటారు.. రేపు పోతారు కానీ..: కిషన్ రెడ్డి

సమాజంలో వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థలు మాత్రమే శాశ్వతమని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఈరోజు ఉంటారు.. రేపు పోతారు కానీ.. వ్యవస్థలు ఎప్పటికీ ఉంటాయని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎప్పటికీ ఉంటాయన్నారు. వీటిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
గవర్నర్, వ్యవస్థని సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

కేసీఆర్‌కు అదే ఆందోళన పట్టుకుందన్న కిషన్ రెడ్డి

కేసీఆర్‌కు అదే ఆందోళన పట్టుకుందన్న కిషన్ రెడ్డి

రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచే పార్టీ బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మునుగోడులో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
తమ పార్టీకి కేసీఆర్ భయపడుతున్నారని, కొడుకును సీఎం చేయలేకపోతున్నా అనే ఆందోళనలోనే ఆయన ఉన్నారని ఎద్దేవా చేశారు.

ప్రధాని మోడీ కేసీఆర్‌కు నచ్చకపోవచ్చు కానీ..: కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ కేసీఆర్‌కు నచ్చకపోవచ్చు కానీ..: కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్ కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీ నచ్చకపోవచ్చని, అయితే, దేశ ప్రజలకు నరేంద్ర మోడీ అంటే ఇష్టమని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు నిరాశ, నిస్పృహలో ఉన్నారని, అందుకే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై దాడులు చేస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Recommended Video

హర్ ఘర్‌ తిరంగా బైక్‌ ర్యాలీని ప్రారంభించిన కిషన్ రెడ్డి *Telangana | Telugu OneIndia
కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమన్న తరుణ్ ఛుగ్

కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమన్న తరుణ్ ఛుగ్

మరోవైపు, బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ తరుణ్ ఛుగ్ కూడా సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమని అన్నారు. బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ధ్వజమెత్తారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదన్నారు. బెంగాల్ తరహాలో విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోందన్నారు. టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నా.. పోలీసులు అడ్డుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రులు వస్తారు పోతారు కానీ.. పోలీసులు మాత్రం న్యాయం వైపే ఉండాలన్నారు. బీజేపీలో చాలా మంది నేతలు చేరుతున్నారన్నారు.

English summary
Kishan Reddy and Tarun Chugh slams CM KCR for his govt policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X