కాంగ్రెస్ సర్కారు మరో మోసం: బాధాకరమంటూ కిషన్ రెడ్డి

బోనస్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు మందకొండిగా సాగుతున్నాయన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 75 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, ఇలా అయితే మొత్తం ధాన్యం కొనేందుకు మరో 2 నెలలు పడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం 50 లక్షల టన్నుల వడ్లు కొనేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. కాంగ్రెస్​ పార్టీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో వరి పంటకు రూ.500 బోనస్​ ఇస్తామని చెప్పిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

kishan reddy fires at congress govt for 500 paddy grain bonus issue

ఇప్పుడేమో సన్న వడ్లకు మాత్రమే ఇస్తాననడం బాధాకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్​, ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. సన్న బియ్యం, దొడ్డు బియ్యం అని రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగామాగం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను, ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. వరి రకాలకు తేడా లేకుండా ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+