చర్లపల్లి తరహాలో మరో హైటెక్ టెర్మినల్, సికింద్రాబాద్ స్టేషన్ ఇక పూర్తి స్థాయిలో..!!
రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. హైదరాబాద్ రైల్వే స్టేషన్ల పై కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తయ్యేది వెల్లడించిన ఆయన.. నగరంలోని అన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. అందు లో భాగంగా తొలి విడతలో హైటెక్ సిటీకి ధీటుగా అక్కడి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగు తున్నాయి. అదే విధంగా మరి కొన్ని స్టేషన్ల పైన రైల్వే శాఖ ఫోకస్ చేసింది.
రైల్వే శాఖ హైదరాబాద్ - సికింద్రాబాద్ పరిధిలోని ప్రధాన స్టేషన్ల అభివృద్ధి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అధునాతనంగా తీర్చిదిద్దిన చర్లపల్లి స్టేషన్ తరహాలోనే మరో రెండు స్టేషన్లను డెవలప్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీటిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. హైటెక్ సిటీతో పోటీపడే విధంగా రైల్వే స్టేషన్‌లను అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీ లించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వచ్చే ఏడాది పూర్తవుతాయని వెల్ల డించారు. హైదరాబాద్ నగరంలోని అన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను రూ. 26 కోట్లతో ఫస్ట్ ఫేజ్‌లో పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
అదే విధంగా సెకండ్ ఫేజ్‌లో రూ. 10 కోట్లతో అప్రోచ్ రోడ్లు, కొత్త భవనాల నిర్మాణం చేపడు తున్నామన్నారు. ఇక్కడ ప్రతి రోజు 62 సబర్బన్ ట్రైన్లు, ఎంఎంటీఎస్ ట్రైన్లు ఆగుతున్నాయని వివరించారు. ఈ స్టేషన్‌ను ఆధునికరించిన తర్వాత హైదరాబాద్‌లోని మిగతా ప్రాంతాలకు మరింత కనెక్టివిటీని పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సంక్రాంతి పండుగ సమయంలో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద 16 స్పెషల్ ట్రైన్లు ఆపబోతున్నాం. హైటెక్ సిటీతో పోటీ పడే విధంగా ఇక్కడి స్టేషన్‌ల నిర్మాణాలు ఉంటాయని ఆయన అన్నారు. రూ.35 కోట్లతో రెండు విడతలుగా పనులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. 2026 ఫిబ్రవరి లోపు తొలి విడత పూర్తవుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications