మీటితే సప్తస్వరాలు, తాకితే పేరిణి నాట్యాలు.. రామప్పకు యునెస్కో గుర్తింపు వెనుక విశేషాలెన్నో!
తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కాకతీయుల కాలంలో నిర్మితమైన అనేక సుందర ప్రాంతాలు కాకతీయుల కాలంనాటి శిల్పకళా సంపదకు, వారి అద్వితీయమైన ప్రతిభకు ప్రతీకగా నిలుస్తున్నాయి. అటువంటి అద్భుతమైన కట్టడం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం రామప్ప ఆలయం.
నలభై ఏళ్ళపాటు నిర్మాణం చేసిన అద్భుతం రామప్ప
ములుగు జిల్లా పాలంపేటలోని కాకతీయుల చే నిర్మించబడిన చారిత్రక దేవాలయం రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. ఈ దేవాలయంలో ప్రతి శిల్పం ఒక విశేషమే.. ప్రపంచంలో మరెక్కడా కనిపించని శిల్ప కళాకృతులు ఇక్కడ దర్శనమిస్తాయి. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని 1173 వ సంవత్సరంలో ప్రారంభించి 1213 వ సంవత్సరంలో పూర్తి చేశారు. 40 సంవత్సరాల పాటు ఈ ఆలయ నిర్మాణాన్ని గావించారు.

శిల్పి రామప్ప పేరుతో ప్రఖ్యాతిపొందిన ఆలయం
ఈ ఆలయాన్ని నిర్మించి ఇప్పటికి 812 సంవత్సరాలు అవుతుంది. రామప్ప ఆలయంలో శివలింగాన్ని కాకతీయ రాజు అయిన రుద్రదేవుడు ప్రతిష్టించాడు. మొదట్లో ఈ ఆలయాన్ని రుద్రేశ్వరాలయం అని పిలిచేవారు. అయితే కాల క్రమంలో ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప పేరుతో ఆలయానికి గుర్తింపు వచ్చింది. ఈ ఆలయంలో ప్రదర్శించిన శివుడిని రామలింగేశ్వర స్వామి గా కొలుస్తారు.
ఈ శిల్పాల ప్రేరణతోనే పేరిణి శివతాండవం
రేచర్ల రుద్రుడు ఒక యుద్ధంలో తాను విజయం సాధించిన దానికి గుర్తుగా రామప్ప దేవాలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెబుతారు. ఇక రామప్ప ఆలయంలోని శిల్ప విశేషాలు కాకతీయుల నృత్యమైన పేరిణి శివతాండవానికి ప్రతీకగా కనిపిస్తాయి. పేరిణి శివతాండవానికి ప్రేరణగా ఆలయం నిలిచింది అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొత్తం ఆలయంలో 1983లో నటరాజ రామకృష్ణ ఈ శిల్పాలను ఆధారం చేసుకుని పేరిణి నాట్య కళను ప్రపంచానికి తెలియజేశారు.
శిల్పాలలో సప్త స్వరాలు
రామప్ప ఆలయ ప్రధాన ద్వారం వద్ద ద్వారపాలికలు ఉంటాయి. ఎడమవైపు చెట్టు పైన శ్రీకృష్ణుడు నిలబడి ఫ్లూట్ వాయిస్తున్న ఒక శిల్పం దర్శనమిస్తుంది. అక్కడ ఉన్న శిల్పాన్ని కొడితే సంగీతం ప్రతిధ్వనిస్తుంది. సప్త స్వరాలు వినిపిస్తాయి .ఇక ఆలయం గర్భగుడిలోకి వెలుతురు వచ్చేలా చాలా గొప్ప టెక్నాలజీ తో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గోపురం పైన కూడా అందమైన శిల్పాలు అద్భుతంగా గోచరమవుతాయి.
రామప్పకు యునెస్కో గుర్తింపు ఇందుకే
నీటిపై తేలియాడే ఇటుకలతో రామప్ప ఆలయ గోపురాన్ని నిర్మించారు. నిర్మాణంలో వాడిన రాళ్లు నేటికీ రంగును కోల్పోక పోవడం కూడా ఒక ప్రత్యేకమైన విషయం. సాండ్ బేస్డ్ టెక్నాలజీతో చేసిన నిర్మాణం, నీటిపై తేలియాడే ఇటుకలు, ఇటుకల రంగు నేటికీ పోకపోవడం, ఈ మూడింటిని ప్రాతిపదికగా తీసుకొని రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చారు. ఇసుకపై నిర్మించిన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది అంటే అది కాకతీయుల ప్రత్యేకత.
పర్యాటకుల మనసును ఆకట్టుకునే రామప్ప చెరువు
ఎంతో అద్భుతంగా శిల్పకళా సౌందర్యం తో అలరారే రామప్ప దేవాలయం మాత్రమే కాకుండా, కాకతీయుల కాలంనాడు తవ్వించిన రామప్ప చెరువు కూడా పర్యాటకుల మనసులను ఆకట్టుకుంటుంది. ఈ చెరువు నేటికీ తాగునీరు, సాగునీరు అవసరాలను తీరుస్తుంది. చాలా అందమైన రామప్ప చెరువు వద్ద పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం చేశారు. ప్రతినిత్యం ఇక్కడకు దేశ, విదేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప చూడాలంటే ఇలా వెళ్ళాలి
ఇంత అద్భుతమైన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ను చూడాలంటే హైదరాబాద్ నుండి వరంగల్ మీదుగా ములుగు జిల్లా పాలంపేట కు వెళ్లాల్సిందే. వరంగల్ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ కు 220 కిలోమీటర్ల దూరంలో రామప్ప ఉంది. మరెందుకు ఆలస్యం సుందరమైన పర్యాటక ప్రాంతమే కాదు చారిత్రక వారసత్వ సంపదకు ఆలవాలమైన రామప్ప ను దర్శించి ఆ శిల్పకళా సౌందర్యానికి ముగ్ధులు కండి.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications