వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ప్లాన్‌తోనే దెబ్బకొట్టిన కోదండ, ఆ మాటల వెనుక ఎవరో చెప్పారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కూడా మంచి చెడులు మాట్లాడవద్దంటే ఎలాగని, అలా అంటే అందరికీ ప్రమాదమేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ గురువారం నాడు అన్నారు. తమ వెనుక ఎవరి హస్తమో ఉందని చెబుతున్నారని, మా వెనుక ఉన్నది ప్రజల హస్తమేనని చెప్పారు.

నిరుద్యోగంపై గళమెత్తనున్న కోదండరామ్..! పాలమూరుకు డేట్ ఫిక్స్మేం మాట్లాడితే మా వెనుక ఏదో హస్తం ఉందని చెప్పడం విడ్డూరమని, తమ వెనుక ప్రజలు ఉన్నారన్నారు. ప్రజల తరఫున మాట్లాడే బాధ్యత తమ పైన ఉందని చెప్పారు. ముంపు తగ్గించేందుకే కంతనపల్లి ప్రాజెక్టును రీడిజైన్ చేశారని, తుమ్మిడిహెట్టి విషయంలో మహారాష్ట్రతో మాట్లాడారని గుర్తు చేశారు.

మరి మల్లన్న సాగర్ విషయంలోను ముంపు తగ్గించేందుకు రీడిజైనింగ్ చేయాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉండరాదని, ప్రాజెక్టుల నిర్మాణానికి మాత్రం తాము వ్యతిరేకం కాదన్నారు. ముంపు ప్రాంతాన్ని తగ్గించాలన్నారు.

కేసీఆర్‌కు మళ్లీ కోదండరాం చురక, 'దమ్ముంటే రండి' (పిక్చర్స్)మల్లన్న సాగర్ కోసం ఇప్పటికిప్పుడు బలవంతపు భూసేకరణ చేయవద్దని, రీడిజైన్ పైన దృష్టి సారించాలన్నారు. రీడిజైన్‌తో మల్లన్న సాగర్ ముంపు తగ్గుతుందన్నారు. తద్వారా గత ప్రభుత్వాల ప్రాజెక్టుల పైన రీడిజైనింగ్ అంటున్న తెరాస ప్రభుత్వానికి కోదండరామ్ అదే ప్లాన్‌తో కౌంటర్ ఇచ్చారు.

Kodandaram announces seminar on Mallanna Sagar project

తమ వెనుక కాంగ్రెస్‌ హస్తముందంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజల కష్టసుఖాలను పరిగణనలోకి తీసుకొని నిపుణులు ప్రాజెక్టుల ఆకృతిని రూపొందించాలే తప్ప, ప్రజల బాగోగులతో సంబంధం లేకుండా ప్రాజెక్టుల ఆకృతులను రూపొందిస్తే ఇలాగే సమస్యలు తలెత్తుతాయన్నారు.

తెలంగాణలో విద్యాంశాలపై తదుపరి కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం, ప్రజల ముందుకు జేఏసీ మీటింగులో తీసుకురావాలని నిర్ణయించామని, ఓపెన్‌కాస్ట్‌, జెన్‌కోల కోసం జరుపుతున్న భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించామని, పలు ప్రాంతాల్లో ఈ అంశంపై క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేశామన్నారు.

తెలంగాణ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నీళ్లు, నిధులపై ఒక ప్రయత్నం జరుగుతోంది కానీ నియామకాలపై ఇంతవరకూ కదలిక లేదన్నారు. పెద్దసంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇంకా ఒప్పంద ఉద్యోగులతోనే పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, యువత తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారన్నారు.

English summary
Chairman of Joint Action Committee Prof Kodandaram made an announcement on Thursday that a seminar would be held on the Mallanna Sagar project so as to cater justice to the affected villagers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X