కోదండరామ్ కొత్త పార్టీ: ఏప్రిల్ 2న ఆవిర్భావం, భారీ బహిరంగ సభ
హైదరాబాద్: తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ నేతృత్వంలో కొత్త పార్టీ ప్రారంభం కానుంది. తెలంగాణ జన సమితి పేరుతో టిజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ కొత్త పార్టీని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ రెండున కోదండరామ్ తెలంగాణ జన సమితి పేరును ప్రకటించనున్నారు.
ఏప్రిల్ రెండవ తేదిన తెలంగాణ జన సమితికి సంబంధించిన కోదండరామ్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ జన సమితికి ఎన్నికల కమిషన్ నుండి అన్ని అనుమతులు వచ్చాయని జెఎసి వర్గాలు ప్రకటించాయి.

ఏప్రిల్ 4న తెలంగాణ జన సమితికి చెందిన పార్టీజెండాను ఆవిష్కరిస్తారని జెఎసి వర్గాలు ప్రకటించాయి. అయితే ఏప్రిల్ 29న, భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు జెఎసి వర్గాలు చెబుతున్నాయి. ఈ సభలోనే పార్టీ విధి విధానాలను కోదండరామ్ ప్రకటించే అవకాశం ఉంది .
ఏప్రిల్ 29న హైద్రాబాద్‌లో సభ ఏర్పాటు కోసం జెఎసి నేతలు రంగం సిద్దం చేసుకొంటున్నారు. హైద్రాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియం, ఎన్టీఆర్ స్టేడియంలలో ఏదో ఒక చోట సభను నిర్వహించాలని కోదండరామ్ భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీ అవసరమని జెఎసి భావించింది. ఈ మేరకు పార్టీని ప్రారంభించాలని కోదండరామ్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు జెఎసి సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications