ఇలాంటి పాలన కోరుకోలేదు: కోదండరాం, ‘సుమన్ నోరు దగ్గర పెట్టుకో’

Subscribe to Oneindia Telugu

వేములవాడ: పాలకుల నియంతృత్వ పోకడలను ప్రజలకు వివరిస్తామని, ఇందుకోసం జూన్ 21వ తేదీ నుంచి 'అమరుల స్ఫూర్తి యాత్ర'ను చేపడుతున్నామని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. వేములవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న పాలనను ఎండగట్టడానికి నాలుగు రోజుల పాటు 'అమరుల స్ఫూర్తి యాత్ర' నిర్వహించతలపెట్టామన్నారు.

జూన్ 21న ఉదయం హైదరాబాద్‌లో అమరులకు నివాళులర్పించిన అనంతరం సంగారెడ్డిలో యాత్ర ప్రారంభమై జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, ఆందోల్‌, నర్సాపూర్‌, మెదక్‌, దుబ్బాక మీదుగా సాగి సిద్దిపేటలో ముగుస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని, ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి వస్తుందని ఆశపడ్డామని, కానీ అలా జరగకపోగా, నియంతృత్వపు పోకడలు పెరిగిపోయాయన్నారు. ఇలాంటి పాలనను ప్రజలు కోరుకోలేదన్నారు.

ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన ఊసేలేదని, ప్రజలకు బతుకుదెరువు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో అభివృద్ధి అవకాశాలు వివరించి, ప్రత్యామ్నాయాలను ప్రజల ముందు ఉంచేందుకు అమరుల స్ఫూర్తి యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాత్రలో అన్ని జిల్లాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

రైతుల సమస్యల పరిష్కారంపై 40 సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ముందు పెట్టిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదన్నారు. తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ అభిృవద్ధి నమూనాను చూపించడం, వాటిని సాధించుకోవడం ప్రధాన ఎజెండాగా తమ యాత్ర సాగుతుందన్నారు. జేఏసీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే పరిస్థితి లేదని, తాను కూడా పార్టీ పెట్టే అవకాశం లేదని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ నిర్మాణంలో సమగ్రమైన పాత్ర పోషించడమే జేఏసీ బాధ్యత అని ఆయన అన్నారు.

kodandaram on Amarula Spoorthy Yatra

ఎంపీ సుమన్‌ నోరు పారేసుకోవద్దు: రాజేందర్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి ఎంపీ బ్కా సుమన్‌ నోరు పారేసుకోకుండా అదుపులో పెట్టుకోవాని కాంగ్రెస్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హన్మకొండ నయీంనగర్‌లోని తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ సుమన్‌ కాంగ్రెస్ నాయకులపై చేసిన ఆరోపణు సరికాదన్నారు. టీఆర్‌ఎస్ నాయకు నిజాయితీ పరులైతే మియాపూర్‌ స్థలా మీద విచారణ జరిపించాని డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌లో ఉన్న దోపిడీదారుకు జైళ్లు సరిపోవని అన్నారు. ఎంపీ సుమన్‌ సన్మానించిన నుగురిలో ఎంత మంది ఉద్యమకారులు ఉన్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ప్రజకు ఇస్తానన్న డబుల్‌ బెడ్‌రూరు ఎక్కడా అని నాయిని ప్రశ్నించారు. గతంలో తాను ఉమ్మడి వరంగల్‌ జిల్లా గ్రంథాయ సంస్థ చైర్మన్‌గా ఉన్నప్పుడు నెకు రూ. 2500 జీతం చెల్లించేవారన్నారు. ప్రస్తుతం ఐదు జిల్లాల్లో ఉ్న ఒక్కొక్క గ్రంథాయ సంస్థ చైర్మన్‌కు రూ. 51 మే చెల్లిస్తున్నారని, ఇదంతా ఎవరి సొమ్ము అని ఆయన ఆరోపించారు.

పూర్వం గ్రంథాయాను దేవాయాు అనే వారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క పుస్తకం కూడా కొనుగోు చేయలేదని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రొఫెసర్‌ జయశంకర్‌, కాళోజీ ఆత్మకు శాంతి కగదని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని పేర్కొన్నారు. విద్యార్థును తెంగాణ ఉద్యమంలో నడిపించిన ప్రొఫెసర్‌ కోదండరాంను తిట్టడం సరికాదని రాజేందర్‌రెడ్డి అన్నారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం 60 ఏళ్లలో రూ. 60 కోట్లు కూడా అప్పు చేయలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన మూడు సంవత్సరాల్లోనే రూ. 200 కోట్లు అప్పు చేశారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకుకు సరైన పర్సంటేజీు ఇచ్చే కాంట్రాక్టర్లు దొరకకపోవడంతో అభివృద్ధిని నిర్ణక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకనైనా టీఆర్‌ఎస్‌ నాయకు కాంగ్రెస్‌ నేతపై ఆరోపణు చేసి పబ్బం గడపుకోకుండా అభివృద్ధి కోసం పాటుపడాలని నాయిని సూచించారు.

సింగరేణిలో ఆందోళనలు

వరంగల్‌: వారసత్వ ఉద్యోగాలు కల్పించాలంటూ సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఆదివారం నాలుగో రోజు కొనసాగింది. ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, అరెస్టులు కొనసాగాయి. భూపాలపల్లిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆదివారం సింగరేణికి వారాంతపు సెలవు అయినా యాజమాన్యం ప్లే డేగా ప్రకటించింది. అంటే ఆదివారం విధులకు హాజరైన వారికి రెండు హాజర్లు (మస్టర్లు) చెల్లిస్తారు. దీంతో 50 శాతానికి పైగా కార్మికులు హాజరయ్యారని, ఉత్పత్తి గణనీయంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

రామకృష్ణాపూర్‌లో టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ దిష్టిబొమ్మను అఖిలపక్ష నాయకులు దహనం చేశారు. రామకృష్ణాపూర్‌లో తమ కార్యాలయాల్లోకి పోలీసులు చొరబడి కార్యకర్తలను కొట్టి అరెస్టు చేశారని సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కళవేణి శంకర్‌ ఆరోపించారు. భూపాలపల్లిలో అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడంతో 365 జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. గంటపాటు ఆందోళన కొనసాగగా, నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సీఐ వేణు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నాయకులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషనకు తరలించారు.

కాగా, కాంగ్రెస్‌ నేత గండ్ర వెంటరమణారెడ్డిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యకర్త బండం అనిల్‌ రెడ్డి సమీపంలో ఉన్న సెల్‌టవర్‌ ఎక్కారు. గంట తర్వాత గండ్ర వస్తే కానీ అతను టవర్‌ దిగి రాలేదు. సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద జాతీయ కార్మిక సంఘాల నాయకులు కార్పోరేట్‌లో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఉద్యోగులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

పోలీసులు వారిని అడ్డుకుని స్టేషనకు తరలించారు. రామగుండం ప్రాంతంలో గోదావరిఖని రాజీవ్‌ రహదారిపై జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో విధులకు హాజరవుతున్న రవి అనే కార్మికుడిపై ఓసీ మూలమలుపు వద్ద ఒక జాతీయ సంఘానికి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

60 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి

సింగరేణి సమ్మెకు ఆదివారం స్పందన కరువైంది. మొదటి, రెండు షిఫ్టులకు 60 శాతానికి పైచిలుకు కార్మికులు హాజరయ్యారు. మొదటి షిఫ్టులో 65 వేల టన్నులకు 60 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. సింగరేణివ్యాప్తంగా మొదటి షిఫ్టులో 18 వేల మంది, 2వ షిఫ్టులో ఆరువేల మంది కార్మికులు హాజరయ్యారు. ఆదివారం సింగరేణి కార్పోరేట్‌లో కూడా విధులు నిర్వహించడం సింగరేణి చరిత్రలో మొదటి సారి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana JAC Chairman Prof. Kodandaram to starts his Amarula Spoorthy Yatra from June 21st.
Please Wait while comments are loading...