వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడు నియోజకవర్గ నేతలతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీలు.. పార్టీ ఫిరాయిస్తారా? సర్వత్రా ఉత్కంఠ!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం దుమారంగా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బిజెపి రాగం అందుకున్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారశైలిపై సీరియస్ అవుతున్నా రాజగోపాల్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారు అన్న ప్రచారం మునుగోడు నియోజకవర్గంలో జోరందుకుంది. అందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా చర్యలు ఊతమిస్తున్నాయి.

అనుచరులు, ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్న మునుగోడు ఎమ్మెల్యే

అనుచరులు, ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్న మునుగోడు ఎమ్మెల్యే

నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేటి నుండి మండలాలు వారీగా కాంగ్రెస్ పార్టీ నేతలు, తన అభిమానులతో హైదరాబాదులో విడివిడిగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని నాయకులతో పార్టీ మార్పుపై చర్చిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికి చెందిన కీలక నేతలతో భేటీ అయి పార్టీ మారితే ఎలా ఉంటుంది అన్నదానిపై చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్ లో పార్టీ నియోజకవర్గ నేతలతో కోమటిరెడ్డి మంతనాలు

హైదరాబాద్ లో పార్టీ నియోజకవర్గ నేతలతో కోమటిరెడ్డి మంతనాలు


అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు ఆయన అనుచరులలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక ఈ రోజు మునుగోడు నియోజకవర్గానికి చెందిన మర్రిగూడెం, చుండూరు మండలం నాయకులను హైదరాబాద్ కు పిలిపించిన ఆయన మధ్యాహ్నం మర్రిగూడెం నేతలతో, సాయంత్రం చుండూరు నేతలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు.

బీజేపీలో చేరికపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్న మునుగోడు ఎమ్మెల్యే

బీజేపీలో చేరికపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్న మునుగోడు ఎమ్మెల్యే


నియోజకవర్గ వ్యాప్తంగా తన అనుచరులతో భేటీలు ముగిసిన అనంతరం ఆయన పార్టీ మార్పు పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. హుజురాబాద్ తరహాలో తాను రాజీనామా అస్త్రం ప్రయోగిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని రాజగోపాల్ రెడ్డి పార్టీ శ్రేణులతో చర్చించినట్లుగా తెలుస్తోంది . తన రాజీనామా అస్త్రం వల్లే గట్టుపల్ వాసుల చిరకాల వాంఛ అయిన మండలం ఏర్పాటు సాకారం అయిందని ఇప్పటికే ఆయన చెప్పుకుంటున్నారు. ఇక బీజేపీ సహకారంతో ఉపఎన్నిక వస్తే నియోజకవర్గ అభివృద్ధి కచ్చితంగా జరుగుతుంది అన్న భావన ఆయన పార్టీ శ్రేణులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం.

రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారా?

రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారా?


ఇక ఇప్పటికే పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సోమవారం సాయంత్రం రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ చెప్పారు. ఆయన పార్టీ మార్పు వెనుక ఉన్న కారణాలపై చర్చించారు. ఈ సమయంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వం పై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇక రేవంత్ రెడ్డి పై తీవ్ర అసహనంతో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయినట్లుగా తాజాగా ఆయన వేస్తున్న అడుగులతో అన్ని రాజకీయ పార్టీలలో చర్చ జరుగుతుంది.

English summary
As Komati Reddy Rajgopal Reddy held meetings with Munugodu constituency leaders, there will be a discussion about his party change again. It is being propagated that he is certain to join in BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X