వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డి నాటకాలు.. కవిత డ్రామాలు.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలనాలు!!

|
Google Oneindia TeluguNews

ఒకపక్క మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడులో రసవత్తర రాజకీయం కొనసాగుతుంటే, మరో పక్క తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం రాజకీయంగా ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ సీఎం కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇక తాజాగా హైదరాబాద్ లో ఈడీ దాడులు కొనసాగిన నేపథ్యంలోనూ తమదైన శైలిలో ఎవరికి వారు ప్రగతి భవన్ లో తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ జాబితాలో టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు.

కవితను, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ ట్వీట్


ఇదిలా ఉంటే తాజాగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై చేసిన ఒక ట్వీట్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసింది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన ఈ ట్వీట్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి భవన్- గాంధీ భవన్ భాయ్ భాయ్ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ లో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాటకాలకు, కల్వకుంట్ల కవిత డ్రామాలకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెర దించిందని పేర్కొన్నారు.

ఢిల్లీలో తీగ లాగితే ప్రగతి భవన్, గాంధీ భవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలింది

ఢిల్లీలో తీగ లాగితే ప్రగతి భవన్, గాంధీ భవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలింది

ఢిల్లీలో తీగలాగితే ప్రగతి భవన్ మరియు గాంధీభవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలింది అని రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఇక అంతే కాదు లిక్కర్ స్కామ్ ద్వారా కేసీఆర్ కుటుంబంతో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చీకటి బందం బట్టబయలైందని , కవిత కంపెనీలలో రేవంత్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుందని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరూ కలిసి బిజినెస్ చేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పోస్టు ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు.

ఓటుకు నోటు కేసు నిర్వీర్యం అయ్యింది అందుకే అన్న రాజగోపాల్ రెడ్డి

ఓటుకు నోటు కేసు నిర్వీర్యం అయ్యింది అందుకే అన్న రాజగోపాల్ రెడ్డి

ఇందుకు సంబంధించి ఒక వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసిన రాజగోపాల్ రెడ్డి కవితతో కలిసి రేవంత్ రెడ్డి వ్యాపారం చేయడం తో పాటు కవిత భర్త అనిల్ రావు తో కలిసి ఎన్నో సెటిల్మెంట్లు రేవంత్ రెడ్డి చేశాడంటూ తన పోస్టు ద్వారా హైలెట్ చేసే ప్రయత్నం చేశారు.వ్యాపార బంధం బలపడింది కాబట్టే ఓటుకు నోటు కేసు నిర్వీర్యం అయిందని రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేశారు. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీవ్రస్థాయిలో విమర్శించారు.

రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి ట్వీట్

రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి ట్వీట్

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా ట్వీట్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కవితతో పాటు కవిత భర్త అనిల్ రావు పేరును ప్రస్తావించడం, తెర ముందు పోరాటం చేస్తూ తెరవెనక వ్యాపారం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజా వ్యాఖ్యలపై, ఆయన పెట్టిన పోస్ట్ పై రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

బతుకమ్మ సంబరాలు ఈడీ ఆఫీస్ లోనా? తీహార్ జైల్లోనా?

ఇక అంతకు ముందు మరో ట్వీట్ లో తెలంగాణలో బతుకమ్మ సంబరాలను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి కవితను టార్గెట్ చేశారు. ఈసారి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబురాలు ఎక్కడ జరుగుతాయి ? ఈడీ ఆఫీసులోనా? లేక సిబిఐ ఆఫీస్ లోనా? లేక తీహార్ జైల్లోనా? అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవిత ను టార్గెట్ చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పేరు వినిపించటంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవితను పదేపదే టార్గెట్ చేస్తున్నారు.

English summary
Komatireddy Rajgopal Reddy tweeted that both Pragati Bhavan and Gandhi Bhavan are one, and made sensational comments that the Delhi liquor scandal opened the secret business relation of Telangana PCC chief Revanth Reddy and MLC Kavitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X