Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం..!
చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం నార్కట్ పల్లి మండలం గోపలాయిపల్లి వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించిన సుదర్శన యాగంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సకాలంలో వర్షాలు కురువాలని మొక్కుకున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని వేణుగోపాల స్వామిని కోరుకున్నామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టుకు గ్రీన్ ఛానల్ ద్వారా రూ. 2వేల కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. బ్రాహ్మణవెళ్ల ఉదయ సముద్రం ప్రాజెక్టును వచ్చే మార్చిలోపు పూర్తి చేస్తామన్నారు. ఆ ప్రాంత వాసులకు కృష్ణా జలాలు అందించి తీరుతామని చెప్పారు. రైతు రుణ మాఫీ చేయడం గొప్ప విషయమన్నారు.

రైతు కోసం ఒకే రోజు రూ.6 వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేసినట్లు చెప్పారు. ఆగస్ట్ వరకు రూ. 2లక్షల రుణ మాఫీ చేసి రైతు కళ్ల ఆనందం చూస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయ పరిధిలో రూ2వేల కోట్లతో 200 కాటేజీలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. రహదారుల విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలుస్తామని తెలిపారు.
నేషనల్ హై వే 65 విజయవాడ-హైదరాబాద్ ఆరు లైన్ల విస్తరణకు సంబంధించి మాట్లాడతామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ వేల కోట్ల రూపాయల స్కామ్ తెరలేపారని అన్నారు. కేసీఆర్ వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూడుకుపోయిందన్నారు.












Click it and Unblock the Notifications