రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో తాము 8 -12 ఎంపీ స్థానాలు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ చేసిన కామెంట్స్ పైన కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశం పైన స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కు సవాల్ చేసారు.

రాజీనామాకు సిద్దం
బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు గెలిస్తే తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సవాల్ చేసారు. బీఆర్ఎస్ 8 నుండి 12 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల పైన కోమటిరెడ్డి స్పందించారు. కేసీఆర్ చెప్పినట్లుగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామాకు సిద్దమన్నారు. కేసీఆర్ అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. నల్గొండలో కేసీఆర్ ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించలేదన్నారు.

Komatireddy Challenge for KCR over Loksbaha Elections in TS

టచ్ లో ఉందెవరో చెప్పాలి
25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌లోకి 25 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారని చెప్పుకొచ్చారు. ఆ 25 మంది ఎమ్మెల్యేల పేర్లు తాను చెబుతానని... మరీ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌లోకి వెళ్లే పాతిక మంది ఎమ్మెల్యేల పేర్లు కేసీఆర్ చెప్పాలని సవాల్ చేసారు. తాము అర్భకులం కాదని.. అర్జునులమై అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడతామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుస్తోందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు.

Komatireddy Challenge for KCR over Loksbaha Elections in TS

తప్పు చేస్తే తప్పదు
సీఎం అయినా..ఎమ్మెల్సీ అయినా తప్పు చేస్తే జైలుకు వెళ్లాల్సిందే అన్నారు. రూల్స్‌ అందరికీ ఒకేలా ఉంటాయి..ఇదికూడా కేసీఆర్‌కు తెలియదా అని నిలదీసారు. ఫోన్‌ ట్యాపింగ్‌ బాధ్యత అప్పటి ప్రభుత్వానిదే అంటూ మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. లిక్కర్‌ స్కామ్‌పై కేసీఆర్‌ తెలిసే మాట్లాడుతున్నారా అని సందేహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్సీ కవిత ఏ ముత్యమో త్వరలో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ అమలు చేసే హామీలే ఇచ్చింది అంటూ కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+