రేవంత్ రెడ్డితో కలిసి కొత్త పార్టీ పెడ్తా: కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కుమార్ నాయకత్వాన్ని తీవ్రంగా విభేదిస్తున్నానని కోమటిరెడ్డి చెప్పారు. ఉత్తమ్‌కుమార్ ఉన్న ఈ సమావేశాలకు హాజరుకానని ఆయన తెలిపారు. అవసరమైతే కొత్తపార్టీ పెడతానని అన్నారు. తాను, రేవంత్‌రెడ్డి, కోదండరామ్ కలిసి తెలంగాణ రెడ్డి సమితి(టీఆర్‌ఎస్) పెట్టుకుంటామని కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీడీపీ నేత రేవంత్‌రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. నిధుల కేటాయింపులో తన నియోజకవర్గానికి అన్యాయం జరిగుతోందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తాడోపేడో తేల్చుకుందామని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ స్పందిస్తూ ఎవరితో తేల్చుకుంటావ్ మీ పార్టీతోనా, ప్రభుత్వంతోనా అని అన్నారు.

తెలంగాణ కోసం రాజీనామా చేశానని, తన విషయంలో ఇలా చేస్తే ఎలా అని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణవాదులకు దొర ప్రభుత్వంలో ప్రాధాన్యతలేదని, కోదండరామ్, కోమటిరెడ్డి లంటి నిజమైన తెలంగాణ వాదులకు అన్యాయం జరుగుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు.
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్రావు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. అసెంబ్లీ ఆవరణలో రేవంత్‌రెడ్డిని కలిసిన శంకర్రావు.. రేవంత్‌రెడ్డితో మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ కంటే టీడీపీ పనితీరు సమర్థంగా ఉంటుందని తాను ముందే ఊహించానని, ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కూడా చెప్పానని రేవంత్‌కు చెప్పడంతో ఆయన నవ్వుకుంటూ వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications