అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు త్వరగా: కేసీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి గురువారం సవాల్ విసిరారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, ఉప ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడు తెరాస సత్తా చూపించాలని చెప్పారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాను చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. ఏఎంఆర్పీ ప్రాజెక్టు కింద మరో 15 టీఎంసీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల వ్యవహారం బయటకు వస్తుందనే త్వరగా పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనుకుంటున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications