కేసీఆర్‌తో భేటీ: కోమటిరెడ్డి హెచ్చరిక, పవన్‌కూ అదే పిచ్చంటూ కత్తి తీవ్ర వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం, ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పవన్ కళ్యాణ్‌కు హెచ్చరిక జారీ చేశారు.

కేసీఆరే స్ఫూర్తి: ఆశ్చర్యం, ఆనందం: భేటీ అనంతరం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్‌కు రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన లేదని కోమటిరెడ్డి చెప్పారు. గతంలో వరంగల్‌లో మాట్లాడిన పవన్.. కేసీఆర్‌ను బట్టలిప్పించి కొడతానని వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు.

చీడపురుగులా తయారయ్యాడు

చీడపురుగులా తయారయ్యాడు

తెలంగాణ సమాజంలో పవన్ కళ్యాణ్ చీడపురుగులా తయారయ్యాడని కోమటిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై పవన్ ప్రశ్నించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. మూడేళ్ల క్రితం కేసీఆర్ తాట తీస్తానన్న పవన్‌కు ఇంతలోనే ఏమయిందని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్

పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్

‘పవన్.. నీ సినిమాలు తెలంగాణలో ఆడాలా.. వద్దా' అని కోమటిరెడ్డి హెచ్చరించారు. గ్లామర్ ఉంటే సినిమాలు తీసుకో.. లేదంటే ఆంధ్రాలో మాట్లాడుకో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ సీఎంతో ఏదో పని ఉండే ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారని ఆరోపించారు.

శత్రువులు, మిత్రులు

శత్రువులు, మిత్రులు

తెలంగాణ సీఎం కేసీఆర్ తో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ దీనిపై స్పందిస్తూ.. ఒకరినొకరు తిట్టుకున్న కేసీఆర్, పవన్ కలిసిపోయారని, శత్రువులు ఆప్తులయ్యారని, ఆప్తులు శత్రువులయ్యారని విమర్శించారు. ఇది సుదీర్ఘ కాలం కొనసాగే ప్రక్రియ కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కలిసిన అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. టీచర్ పోస్టుల భర్తీలో టెట్ కు లేని నిబంధనలు టీఆర్టీకి ఎందుకు? అని ప్రశ్నించారు. కాంట్రిబ్యూటరీ స్కీమ్ ను రద్దు చేయాలని, ఏపీలో పనిచేస్తున్న నాల్గో తరగతి ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

బ్రోకర్ అంటూ కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్యలు

బ్రోకర్ అంటూ కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సినీ క్రిటిక్ మహేశ్ కత్తి మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ న్యూస్ ఛానెల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘జనసేన', పవన్ కళ్యాణ్ కాపు కులం పిచ్చితో కొట్టుకుంటున్న, దళితులకు వ్యతిరేకంగా ఉన్న ఒక కులం పార్టీ ఇది. కాపు-కమ్మలను ఒకటి చేయడానికి పవన్ కళ్యాణ్ అనే పవర్ బ్రోకర్ ఆడుతున్న నాటకమిది. పవన్ కల్యాణ్ పొలిటికల్ జోకర్.. పవర్ బ్రోకర్. కుల అహంకారాన్ని నరనరాన జీర్ణించుకున్న పార్టీ ‘జనసేన'. రిజర్వేషన్లు, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై పవన్ అభిమాని కళ్యాణ్ దిలీప్ సుంకరకు తెలిసినంత కూడా పవన్ కళ్యాణ్‌కు తెలియదు' అని మహేశ్ కత్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress MLA Komatireddy Venkat Reddy fired at Jana Sena President Pawan Kalyan for meeting with Telangana CM K Chandrasekhar Rao.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి