న్యాయస్థానాలతో నాటకాలు దారుణం: కోమటిరెడ్డి, హైకోర్టు తీర్పుపై జానారెడ్డి స్పందన
హైదరాబాద్: హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోమవారం అన్నారు. ఎమ్మెల్యేల అర్హత పిటిషన్ విషయంలో హైకోర్టులో కోమటిరెడ్డి, సంపత్‌లకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు.
తమ సభ్యత్వం పునరుద్ధరించాలని, కోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై కేసీఆర్‌కు నమ్మకం లేదని మండిపడ్డారు. న్యాయవ్యవస్థతో నాటకాలు దారుణం అన్నారు. ప్రజలను మోసం చేసినట్లుగా న్యాయవ్యవస్థను కూడా మోసం చేస్తున్నారన్నారు.

కోమటిరెడ్డికి భద్రత కల్పించాలి: జానారెడ్డి
కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వం రద్దుపై హైకోర్టు తీర్పును హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కోర్టు తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. తీర్పును అమలు చేసి స్పీకర్ చట్టల సభల హుందాతనాన్ని కాపాడాలని హితవు పలికారు. పంచాయతీరాజ్ చట్టసవరణ కోసం అసెంబ్లీని సమావేశపర్చాలన్నారు. కాంగ్రెస్ నేతలపై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కోమటిరెడ్డికి భద్రత కల్పించాలని ప్రభుత్వానికి లేఖ రాశానని జానా పేర్కొన్నారు.
హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి న్యాయ వ్యవస్థలపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇప్పటికైనా స్పీకర్ న్యాయస్థానాల తీర్పును గౌరవించి కోమటిరెడ్డి, సంతప్ కుమార్‌ల పదవులను పునరుద్ధరించాలన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications