టిఆర్ఎస్‌లో చేరేందుకు కెసిఆర్‌ను కోమటిరెడ్డి ప్రాధేయపడ్డాడు: గుత్తా

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్లగొండ: వారం రోజుల కిందట వరకు టీఆర్ఎస్‌లో చేరేందుకు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను బతిమాలిన విషయం వాస్తవం కాదా అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు.

చలో అసెంబ్లీ పేరుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారని నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ద్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహరశైలితో పార్టీకి ఇబ్బందులు వస్తాయని కేసీఆర్... కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని తిరస్కరించారని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు.

Komatireddy Venkat Reddy tried to join TRS says Gutta Sukhender Reddy

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకోకపోవడంతో చలో అసెంబ్లీ పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నాడని గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. కోతి చేష్టలు చేసే వ్యక్తుల మాటలను రైతులు నమ్మవద్దని గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.

రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం మంచిది కాదని కోమటిరెడ్డికి గుత్తా సుఖేందర్‌రెడ్డి హితవు పలికారు. వర్షాలతో పత్తి రైతులకు ఇబ్బందులు పడుతున్నది వాస్తవమేనన్నారు. పత్తి కొనుగోలు కోసం సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎంపీ అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nalgonda Mp Gutha Sukender Reddy sensational comments on Congress Mla Komatireddy Venkat Reddy on Tuesday at Nalgonda. Sukhender Reddy said that Komatireddy Venkat Reddy tried to join in Trs last week.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి