వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్గొండలో హరీశ్‌రావు సభ కోసం కోమటిరెడ్డి జన సమీకరణ!..

నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లి మండల పరిధిలోని బ్రాహ్మణవెల్లెం గ్రామంలో నిర్మిస్తున్న ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు గతంలో ప్రకటించిన సంగతి

|
Google Oneindia TeluguNews

నల్గొండ: నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లి మండల పరిధిలోని బ్రాహ్మణవెల్లెం గ్రామంలో నిర్మిస్తున్న ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సమయం దగ్గరపడటంతో.. పనులను మరోసారి స్వయంగా పరిశీలించేందుకు ఆయన నల్గొండలో పర్యటించనున్నారు.

నల్గొండ పర్యటనలో భాగంగా ఉదయ సముద్రం పనుల పరిశీలనతో పాటు, బత్తాయి మార్కెట్ ను హరీశ్ రావు ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జనసమీకరణ చేస్తుండటం గమనార్హం.

komatireddy venkata reddy to mobilise huge crowd for harish rao's public meet

బత్తాయి మార్కెట్‌, ఉదయసముద్రం ప్రాజెక్టు సాధనే తన జీవితాశయమన్న కోమటిరెడ్డి.. మార్కెట్ ప్రారంభోత్సవానికి వస్తున్న హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ యార్డు ప్రారంభం సందర్భంగా.. రాజకీయాలకు అతీతంగా రైతులు తరలిరావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.

మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు కూడా జనసమీకరణకు దిగడంతో.. కొంత టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొంది. హరీశ్ రావుతో పాటు మరో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ శ్రేణులకు, టీఆర్ఎస్ శ్రేణులకు ఎక్కడా ఘర్షణ చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.

English summary
Congress Mla Komatireddy Venkata Reddy mobilising crowd for Minister Harish Rao's meeting in Nalgonda on the occassion of market opening
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X