కాంగ్రెస్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ షాక్ - నెక్స్ట్ స్టెప్..!!

తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్..ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ తన నిర్ణయంతో పార్టీ నేతలకు జలక్ ఇచ్చారు. సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి -కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు మునుగోడు బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడిన సమయం లో టీపీసీసీ చీఫ్ రేవంత్ తో సహా తెలంగాణ కాంగ్రెస్ లోని కొందరు చేసిన వ్యాఖ్యల పైన వెంకటరెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యల పైన విచారం వ్యక్తం చేసారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొంటారంటూ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు.

మునుగోడు ఎన్నిక వేళ కీలకంగా

మునుగోడు ఎన్నిక వేళ కీలకంగా

ఇప్పటి వరకు వెంకటరెడ్డి తన సోదరుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి ప్రచారం చేయలేదు. ఢిల్లీలో ప్రియాంక - హైదరాబాద్ లో గాంధీ భవన్ వేదికగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ఏ సమావేశానికి వెంకటరెడ్డి హాజరు కాలేదు. ఇక, ఇప్పుడు మునుగోడు బై పోల్ షెడ్యూల్ రావటం.. అభ్యర్ధి ప్రకటించిన వేళ.. పార్టీ నేతలు ప్రచారంలోకి దిగుతున్నారు. మరో వైపు పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఈ నెల 24వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రారంభించనున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ పరిధిలోకి వస్తుంది. పార్టీ ముఖ్యనేతలంతా వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెబుతూ వచ్చారు. కానీ, ఈ సమయంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఉప ఎన్నిక - రాహుల్ యాత్రకు దూరంగా

ఉప ఎన్నిక - రాహుల్ యాత్రకు దూరంగా

ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. అందుకు ఈ నెల 15వ తేదీ ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. నవంబర్ 3న మునుగోడు ఎన్నికల పోలింగ్..6న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అవి పూర్తయిన తరువాతనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరిగి హైదరాబాద్ రానున్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడి బీజేపీలో చేరిన సమయం నుంచి వెంకటరెడ్డి పైన కాంగ్రెస్ లో అనుమానాలు మొదలయ్యాయి. వెంకటరెడ్డి పార్టీని వీడేందుకు సిద్దమయ్యారనే ప్రచారం సొంత పార్టీలోనే వినిపించింది. ఇదే సమయంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తరువాత..మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాహుల్ జోడో యాత్ర సమయంలోనే తెలంగాణలోని కాంగ్రెస్ ఎంపీల్లో ఒకరిద్దరు పార్టీ వీడేందుకు సిద్దమయ్యారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా పార్టీ నేతలు ఖండించారు. కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా ఉన్నారనేది రాహుల్ జోడో యాత్ర ద్వారా స్పష్టం అవుతోందంటూ వ్యాఖ్యానించారు.

తమ్ముడు కోసమేనా -ఏం చేయబోతున్నారు

తమ్ముడు కోసమేనా -ఏం చేయబోతున్నారు

ఇప్పుడు తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఇష్టం లేకనే..ఆయన కుటుంబంలో విభేదాలకు అవకాశం ఉండదనే ఆలోచనతోనే ఈ విదేశీ ట్రిప్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికతో పాటుగా రాహుల్ భారత్ జోడో యాత్రకు వెంకటరెడ్డి అందుబాటులో ఉండటం లేదు. దీంతో..ఇప్పటి వరకు మునుగోడులో వెంకటరెడ్డి చివరి నిమిషంలో ప్రచారంలో పాల్గొంటారనే పార్టీ నేతల అంచనాలు తల కిందులు అయ్యాయి. నల్గొండ జిల్లాలో పార్టీతో పాటుగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు వ్యక్తిగతంగా మంచి నేతలుగా గుర్తింపు ఉంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరటం.. వెంకటరెడ్డి కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ కీలకమైన మునుగోడు ప్రచారానికి దూరం కానుండటంతో అది రాజకీయంగా ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనే చర్చ మొదలైంది. ఇక, ఇదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజా నిర్ణయం పైన రేవంత్ అండ్ టీం ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ లో కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+