వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండపోచమ్మ కెనాల్ గండి ఘటన ... ఇది లీకేజీల ప్రభుత్వం అని బండి సంజయ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

కొండపోచమ్మ కెనాల్ కు గండి పడిన ఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.మొన్న కాళేశ్వరం,అంతకుముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, ఇప్పుడు కొండ పోచమ్మకుగండి పడటంతో రాష్ట్రంలో లీకేజీల ప్రభుత్వం నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా నిర్మాణాలు జరిగాయని,వీటి వల్ల ప్రాజెక్టుల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

సీఎం సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.సీఎం కేసీఆర్ స్కీమ్ లను స్కాముల కోసమే పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన బండి సంజయ్ నాణ్యత లేని పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం కాంట్రాక్టర్ నుండి నిర్మాణానికి అయిన డబ్బులను రికవర్ చేయాలంటూ, మరమ్మతు పనులు చేపట్టాలంటూ పేర్కొన్నారు.

konda pochamma canal water leakage : Bandi Sanjay Fire on Telangana government

కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లనే నాసిరకం పనులు జరిగాయని, ఇక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తక్షణం ప్రాజెక్టు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. నాణ్యత లేని పనులు చేస్తుంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులకు గండ్లు పడుతున్నాయని, నీళ్లు లీక్ అవుతున్నాయని మండిపడిన బండి సంజయ్ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని తక్షణం కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

English summary
BJP state president Bandi Sanjay was furious over the water leakage incident that occurred at the Kondapochamma canal .Bandi Sanjay has strongly criticized the situation in the CM's own constituency. He demanded to Cancel the licence of the contractor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X