చీఫ్ ట్రిక్స్ వద్దు: కొండా సురేఖ, భయపడం: జగదీష్

వరంగల్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణకు మంచి చేయకున్నా, చెడు చేయవద్దని తెరాస శాసన సభ్యురాలు కొండా సురేఖ వరంగల్ జిల్లాలో ఆదివారం అన్నారు. టీడీపీ నేతలు సభాపతి పైన అవిశ్వాసం పెడతామని దిగజారి మాట్లాడుతున్నారన్నారు. వారు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ నేతలే రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్నారన్నారు. టీడీపీ నేతలు చీఫ్ ట్రిక్స్ మానుకోవాలన్నారు.

భయపడం: జగదీశ్వర్ రెడ్డి

Konda Surekha lashes out at TDP leaders

తెరాస ప్రభుత్వం ఎవరికీ భయపడదని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆదివారం అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజల ముందు ఎండగట్టి తిప్పికొట్టాల్సిన బాధ్యత తెరాస కార్యకర్తలదే అన్నారు. తెరాస కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు తమకు వత్తాసు పలుకుతున్న మీడియాతో కలిసి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

ఎన్ని నిర్ణయాలు తీసుకొని అయినా తెలంగాణ హక్కులను కాపాడుకుంటామన్నారు. తెలంగాణ సంస్కృతిని కాపాడటంలో భాగంగానే కేసీఆర్ చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. పట్టభద్రుల మండలి ఎన్నికలకు డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారంతా ఓటు నమోదు చేసుకోవాలన్నారు.

టీడీపీ ఆరిపోయే దీపమని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ జిల్లాలో అన్నారు. టీడీపీ నేతలు తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం ఆంధ్రాలో దీక్ష చేయాలన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును మార్చొద్దని దీక్షలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం అభివృద్ధిని ఓర్వలేక వారు పనికి రాని విమర్శలు చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+