కొండా సురేఖకు ఆ పార్టీలోకి ఆహ్వానం.. వీడియో రిలీజ్ చేసిన పార్టీ అధినేత!
తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై రాజీనామా, బర్తరఫ్ వార్తలు వస్తున్న సందర్భంగా ఆయన ఆమెను తన పార్టీలోకి బహిరంగంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ లో సామాజిక సమీకరణాలపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు
కొండా సురేఖను తన పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్ మీ కోసం ప్రజాశాంతి పార్టీ ఉంది వేరే పార్టీలోకి వెళ్లకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోలో కాంగ్రెస్ లో సామాజిక సమీకరణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు.

5 శాతం ఉన్న రెడ్లను 12 మందిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్: కేఏ పాల్
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకుల పదవులకు ఎలాంటి డోకా ఉండదు, కేవలం బీసీ నాయకుల పదవులకే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకులకే పెద్దపీట వేస్తూ, బీసీ నాయకులను అణచివేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.80 సంవత్సరాలలో 5 శాతం ఉన్న రెడ్లను 12 మందిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొండా సురేఖను సీఎం చెయ్యాలి
బీసీలు 50శాతం ఉన్నా, 27 శాతం కాపులు ఉన్నా, 90 శాతం బడుగు బలహీనవర్గాలు ఉన్నా వారిని సీఎం ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలను ముఖ్యమంత్రి చెయ్యరని అన్నారు.కొండా సురేఖ బీసీ బిడ్డ అని, ఆమెను ముఖ్యమంత్రి చెయ్యాలని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. అలాంటి మహిళను కూతురు ఏదో తిట్టిందని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తున్నారని అన్నారు.
జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ తిట్టలేదా? వారిపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్న
అలా అయితే జగ్గారెడ్డి తిట్టలేదా, కోమటి రెడ్డి బ్రదర్స్ తిట్టటం లేదా వారిని ఎందుకు బర్తరఫ్ చెయ్యటం లేదని ప్రశ్నించారు. వారు రెడ్డి కాబట్టి వారి పదవులు పోవన్నారు. బీసీలంటే వాళ్లకు లేక్కలేదన్నారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీ ఒకటే మార్గం అని కేఏ పాల్ అన్నారు.
ప్రజా శాంతి పార్టీలోకి కొండా సురేఖకు ఆహ్వానం
కొండా సురేఖ వంటి బీసీ వర్గానికి చెందిన బలమైన నాయకురాలు ప్రజాశాంతి పార్టీలోకి వస్తే తగిన గౌరవం, ప్రాధాన్యత దక్కుతాయని పేర్కొన్నారు. బీసీలు, బడుగు బలహీన వర్గాలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.కొండా సురేఖ బర్తరఫ్ కు గవర్నర్ కు లేఖ పంపిన వేళ కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.













Click it and Unblock the Notifications