సురేఖ పై చర్యల వేళ బిగ్ ట్విస్ట్- ఒక్క మీటింగ్ తో సీన్ ఛేంజ్..!!

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ వివాదం పార్టీ లో సంచలనంగా మారింది. సురేఖ పై చర్యలు తీసుకోవాలని పార్టీకి క్రమశిక్షణా సంఘం చేసిన తాజా సిఫారసుల పైన నిర్ణయం ఉత్కంఠ పెంచుతోంది. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయం ఏంటనే చర్చ పార్టీలో నడుస్తోంది. ఈ సమయంలోనే ఆసక్తి కర సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో.. అసలు సురేఖ పైన చర్యలు ఉంటాయా.. బ్రేక్ పడుతుందా అనేది కీలకంగా మారుతోంది.

మంత్రి కొండా సురేఖ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంటోంది. సురేఖ కుమార్తు సుస్మిత చేసిన వ్యాఖ్యల పైన పార్టీ ఆగ్రహంగా ఉంది. సురేఖ పైనా చర్యలు తీసుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ క్రమిశిక్షణా కమిటీ సైతం హైకమాండ్ కు సురేఖ తో పాటుగా చిన్నారెడ్డి పైనా వేటు వేయాలని సిఫారసు చేసింది. కాగా.. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటన కారణంగా నిర్ణయం పెండింగ్ లో ఉంది. ఇదే సమయంలో కొండా దంపతులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. కొండా సురేఖ ఖర్గేను కలవగా... కొండా మురళీ తాజాగా డిప్యూటీ సీఎం భట్టితో సమావేశం అయ్యారు. ఆ తరువాత వ్యూహాత్మకంగా తాము పార్టీలోనే కొనసాగుతామని ప్రత్యేకంగా ప్రకటించారు. ఇక, తాజాగా ఖార్గేతో భట్టి సైతం సమావేశం అయ్యారు.

 మోదీ కేబినెట్ ప్రక్షాళన, ఇన్- ఔట్ ఇలా: తెలుగు రాష్ట్రాల నుంచి.. లిస్టులో...!!
మోదీ కేబినెట్ ప్రక్షాళన, ఇన్- ఔట్ ఇలా: తెలుగు రాష్ట్రాల నుంచి.. లిస్టులో...!!
konda-surekha-meets-cm-revanth-reddy-ties-rakhi-amid-ongoing-congress-controversy-details-here

సురేఖ పై తుది నిర్ణయం ఏంటి

అటు కొండా సురేఖ మాత్రం తన పని తాను చేసుకు పోతున్నారు. కొండా సురేఖ ను తప్పిస్తే ఆ స్థానంలో ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇదే సమయంలో కొండా సురేఖ సీఎం రేవంత్ ను కలిసారు. రాఖీ కట్టేందుకు అప్పాయింట్ మెంట్ తీసుకొని మరీ వచ్చి కలిసారు. రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో.. సురేఖ తన కుమార్తె వ్యాఖ్యల పైన ఇప్పటికే వివరణ ఇవ్వగా.. పార్టీ మాత్రం పరిగణలోకి తీసుకోవటం లేదు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల లోగానే సురేఖ ను రాజీనామా చేయమని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. సురేఖ మాత్రం ఈ వివాదం నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ అవకాశం ఇస్తే వ్యక్తిగతంగా తన వాదన వినిపించేందుకు సిద్దమయ్యారు. తాజా వివాదం వేళ రేవంత్ తో సురేఖ భేటీ కీలకంగా మారుతోంది. కాగా.. సురేఖ విషయంలో సీఎం రేవంత్ గట్టిగానే ఉండగా.. హైకమాండ్ నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+