రాం గోపాల్ వర్మకు హారతిచ్చి స్వాగతం పలికిన కొండా సురేఖ .. 'కొండా' సినిమా షూటింగ్ వరంగల్ లో ప్రారంభం

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సినిమా 'కొండా'. తెలంగాణ రాజకీయాలలో సెన్సేషన్ సృష్టిస్తుంది అని రాం గోపాల్ వర్మ చెప్పుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు మొదలైంది. తెలంగాణ రక్త చరిత్ర ను తెరకెక్కిస్తా అని చెప్పిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా కొండా షూటింగును వరంగల్ వేదికగా ప్రారంభించారు. కొండ మురళి, కొండా సురేఖ జీవిత చరిత్రపై కొండా సినిమాను తెరకెక్కిస్తున్న రాంగోపాల్ వర్మ ప్రస్తుతం వరంగల్ నగరంలో సందడి చేస్తున్నారు.

రాం గోపాల్ వర్మకు హారతిచ్చి స్వాగతించిన సురేఖ

రాం గోపాల్ వర్మకు హారతిచ్చి స్వాగతించిన సురేఖ

వరంగల్ ప్రాంతానికి చెందిన దంపతులు కొండా సురేఖ, కొండా మురళి జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం వరంగల్ జిల్లాలోనే కొనసాగనున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మకు కొండా సురేఖ స్వాగతం పలికారు. కొండా సురేఖ ఇంటికి వెళ్ళిన రాంగోపాల్ వర్మకు సురేఖ హారతి పట్టి, దిష్టి తీసి మరీ స్వాగతం పలికారు. కొండా చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా కొండా సురేఖ అనుచరులతో వరంగల్లో రామ్ గోపాల్ వర్మ ర్యాలీ చేశారు.

వంచనగిరిలో చిత్ర షూటింగ్ ప్రారంభం

వంచనగిరిలో చిత్ర షూటింగ్ ప్రారంభం

కొండా సురేఖ, కొండా మురళి లపై బయోపిక్ తెరకెక్కిస్తున్న రాంగోపాల్ వర్మను కొండా సురేఖ దంపతులు ఓ రేంజ్ లో గౌరవిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున వరంగల్ నగరంలో కొండా సినిమా నిర్మాణం హడావిడి కొనసాగింది. ఒకవైపు ఒక వర్గం ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాంగోపాల్ వర్మ ఈ సినిమాతో ఎలాంటి సున్నితమైన అంశాలపై వివాదాన్ని తెరకెక్కిస్తారో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే వంచనగిరి సమీపంలో చిత్ర నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో వంచనగిరి చేరుకున్న రామ్ గోపాల్ వర్మ కు అక్కడ సాదర స్వాగతం లభించింది.

 నాస్తికుడు వర్మ చిత్ర షూటింగ్ కు మైసమ్మ గుడిలో అమ్మవారికి మద్యం

నాస్తికుడు వర్మ చిత్ర షూటింగ్ కు మైసమ్మ గుడిలో అమ్మవారికి మద్యం

దేవుళ్లను నమ్మని రామ్ గోపాల్ వర్మ కొండా సినిమా చిత్ర నిర్మాణంలో భాగంగా వంచనగిరి లోని గండి మైసమ్మ ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు. మద్యాన్ని అమ్మవారికి సమర్పించారు. గండిమైసమ్మ కు మద్యం సమర్పించే సంస్కృతి ఉన్న నేపథ్యంలోనే వర్మ ఆ విధంగా చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ నాస్తికుడుగా చెప్పుకునే వర్మ ఆలయాల్లో పూజలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గండి మైసమ్మ ఆలయంలో పూజలపై వర్మ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ లో తాను మాత్రమే ఓడ్కా తాగుతానని అనుకున్నానని, కానీ తాను మైసమ్మ తల్లిని విస్కీ తాకేలా చేశాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

భారీ ర్యాలీకి పోలీసుల బ్రేక్ .. తెలంగాణా రక్త చరిత్ర తీస్తున్న కొండా మురళి

భారీ ర్యాలీకి పోలీసుల బ్రేక్ .. తెలంగాణా రక్త చరిత్ర తీస్తున్న కొండా మురళి

కొండా మురళి ఇంటి నుండి మొదటి భారీ ర్యాలీ నిర్వహించాలి అనుకున్నా, పోలీసులు అనుమతి నిరాకరించడంతో తూతూమంత్రంగా ర్యాలీని కొనసాగించారు. ప్రస్తుతం కొండా మురళి స్వగ్రామమైన వంచనగిరి గ్రామంలో కొండా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గతంలో రామ్ గోపాల్ వర్మ రాయలసీమ ఫ్యాక్షనిజం పై రక్త చరిత్ర పేరుతో రెండు భాగాలుగా చిత్రాలు తీశారు. ఇప్పుడు తెలంగాణలోని రక్త చరిత్ర చూపిస్తానంటూ కొండా మురళి, మాజీ నక్సలైట్ ఆర్కే ల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని, కొండా మురళి సురేఖ ల మధ్య సాగిన లవ్ స్టోరీని ఆధారంగా చేసుకొని చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ కపుల్ గా ఉన్న కొండా మురళి, సురేఖల బయోపిక్ తీస్తుండటం ప్రస్తుతం వరంగల్ నగరంలో హాట్ టాపిక్ గా మారింది.

Recommended Video

    Bigg Boss లో ఇలా ఆడితే ఫ్యాన్స్ ఒప్పుకోరు.. Mind It | SRC ఫ్యాన్స్ స్ట్రాటజీ || Oneindia Telugu
    ఎర్రబెల్లి దయాకర్ రావుకు, కొండా మురళికి మధ్య శతృత్వం .. సినిమాపై ఉత్కంఠ

    ఎర్రబెల్లి దయాకర్ రావుకు, కొండా మురళికి మధ్య శతృత్వం .. సినిమాపై ఉత్కంఠ

    ఇటీవల కొండా' సినిమాకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ పోస్టర్ లలోనే కొండా మురళి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించారు. 1980వ సంవత్సరంలో జరిగిన ఘటన ఆధారంగా కొండా సురేఖ, మురళి లవ్ స్టోరీ, కొండా మురళికి నక్సలైట్ ఆర్కే తో ఉన్న ప్రత్యేక అనుబంధం, అటు రాజకీయాలు, ఇటు లవ్ స్టోరీ రెంటినీ వర్మ చూపించబోతున్నారు. కొండా మురళికి, ఎర్రబెల్లి దయాకర్ రావుకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా శత్రుత్వం ఉన్న నేపధ్యంలో ఈ సినిమాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+