రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..వరంగల్‌కు ఆ దేశం పెట్టుబడులు..!!
వరంగల్ ప్రజలకు శుభవార్త చెప్పారు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి బృందం పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బృందం పది రోజులు అమెరికా పర్యటన ముగించుకొని అక్కడి నుంచి నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకుంది. నేడు అక్కడి కంపెనీలతో సమావేశమై తెలంగాణా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటానికి చర్చలు జరుపుతుంది.
కొరియాలో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి
ఇందులో భాగంగా నేడు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు గ్లోబల్ కంపెనీల అధినేతలు, బిజినెస్ గ్రూపులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. వరుస మీటింగ్ లతో బిజీగా గడుపుతున్నారు. ఈక్రమంలోనే కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

టెక్స్ టైల్స్ రంగం విస్తృతి.. అనుకూలతలపై రేవంత్ ప్రసంగం
తెలంగాణా రాష్ట్రం అన్ని విధాలా పెట్టుబడులకు అనుకూలమని రేవంత్ చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టె వారికి తాము అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా టెక్స్ టైల్ పార్కు లలో పెట్టుబడులు పెట్టే అంశంపై ఆయన మాట్లాడారు. టెక్స్‌టైల్ రంగం విస్తృత్తికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతోపాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ లో పెట్టుబడులకు కొరియన్ సంస్థల ఆసక్తి
వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. దీంతో వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతో ఈమేరకు కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. దీంతో వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో కొరియన్ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి.
బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం తో పాటు మంత్రి దుద్దిళ్ళ
యంగాన్ కార్పొరేషన్ చైర్మన్ కియాక్ సంగ్, కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సొయంగ్ జూ సహా 25 అగ్రశ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధినేతలు ఈ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా సమావేశంలో ఉన్నారు. వారంతా తెలంగాణలో ఉన్న అవకాశాలను అక్కడ సమావేశాలలో వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications