శ్రీశైలం నుంచి నీటి విడుదల, సమంగా వాడుకోండి: ఏపీ-టీలకు బోర్డు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలలో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది.

కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి గుప్తా, తెలంగాణ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ రవి కుమార్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఏఅపీ చీఫ్ ఇంజినీర్ రామకృష్ణలు ఈ భేటీకి హాజరయ్యారు.

శ్రీశైలం నుంచి రోజుకు ఐదువేల క్యూసెక్కుల నీటిని పది రోజుల పాటు విడుదల చేయాలని నిర్ణయించారు. తాగునీటి అవసరాల నేపథ్యంలో విడుదల చేయనున్నారు. ఆ నీటిని రెండు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని కమిటీ సూచించింది.

Krishna board tells to release water

శ్రీశైలం నుంచి మంగళవారం నీటి విడుదల ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటిమట్టం 509.7 అడుగులు ఉంది. ఇది 510 అడుగులకు చేరిన తర్వాత సాగర్ కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తారు.

నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏఎంఆర్పీ ద్వారా రోజుకు 900 నుంచి వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తారు. శ్రీశైలం నుంచి విడుదలయ్యే నీటిలో సగం వాటా తీసుకునే వరకు ఈ విడుదల ఉంటుంది. చెరో 2,500 క్యూసెక్కుల వినియోగానికి అంగీకారం కుదిరింది. మొత్తంగా 4.3 టిఎంసీలుగా లెక్క తేల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+