మీ చుక్క నీరొద్దు: హరీష్, మా గేట్లు మీరెత్తుతారా, మాకూ వద్దు: దేవినేని

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ - తెలంగాణల మధ్య జల జగడం కొనసాగుతోందిత. గురువారం ఢిల్లీలో కృష్ణా నదీ జలాల పంపకంపై కేంద్రంతో సంప్రదింపులు జరిగాయి. ఈ భేటీ ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. అనంతరం తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావులు మాట్లాడారు.

హరీష్ రావు మాట్లాడుతూ... మాకు (తెలంగాణ) కేటాయించిన నీటినే మేం వదులుకుంటామని, ఏపీ నీటిని ఒక్క చుక్క కూడా వాడుకోమని చెప్పారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం తెలంగాణకు 90 టీఎంసీల నీటిని కేటాయించారన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే కేంద్రం స్థాయిలో పోరాటం చేస్తామన్నారు.

harish

తెలంగాణతో పాటు ఏపీలోని అన్ని ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కిందకు తీసుకు వస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఏపీ నీటిలో ఒక్క చుక్క అవసరం లేదని, అది వితండవాదం మానుకోవాలన్నారు. ఏపీ ఏకపక్ష విధానాలతో ముందుకెళ్తోందని చెప్పారు. తెలంగాణ కోసం జరిగితే ఢిల్లీ స్థాయిలో, అవసరమైతే సుప్రీం కోర్టులో పోరాటం చేస్తామని చెప్పారు.

అనంతరం దేవినేని మీడియాతో మాట్లాడుతూ...

ఈ మూడు రోజుల సమీక్షలో జలవనరుల శాఖ అధికారులకు సమస్య పైన పూర్తి అవగాహన వచ్చిందన్నారు. తాము కోరుకోని విభజన చేసి, తమ పైన లక్ష కోట్ల అప్పులు పెట్టారని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగా ఇప్పుడు ఏపీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు.

మేం ఆదుకున్నా, ఏపీది విచిత్ర వైఖరి, ఆ 'శక్తి' తెలుసు: హరీష్, కేంద్రంపై ఆగ్రహం

నీటి పంపకాల విషయం పునర్విభజన చట్టంలో స్పష్టంగా చెప్పబడి ఉందని తెలిపారు. కేంద్రం చర్చల కోసం పిలిస్తే మళ్లీ వస్తామని చెప్పారు. ఏపీ భూభాగంలో రాయలసీమలోని నాలుగు జిల్లాలు కరువు పీడిత ప్రాంతాలన్నారు.

తమ భూభాగంలోని ప్రాజెక్టుల గేట్లు కూడా మేం ఆపరేట్ చేస్తామని తెలంగాణ చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణ రైతాంగానికి చెందిన ఒక్క చుక్క నీరు తమకు వద్దని, తెలంగాణ మొండి వాదన, తొండివాదన చేస్తోందని ఎద్దేవా చేశారుత.

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తితో సీమలో నీటి సమస్య ఏర్పడుతోందన్నారు. తమ ప్రాంత రైతాంగ హక్కులను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని హరీష్ రావు, తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. మరోవైపు కర్నాటక అల్మట్టి ఎత్తు పెంచి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందన్నారు.

తెలంగాణది తొండివాదన: హరీష్ రావుకు దేవినేని ఉమ కౌంటర్

తాము తెలంగాణతో కలిసి పని చేసేందుకు సిద్ధమని చెప్పారు. తాము విభజన కోరుకోలేదన్నారు. అసలు విభజన చట్టం మేం రాశామా అని ప్రశ్నించారు. మేం ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే మూడు పంటలు పండించుకున్నామని చెప్పడం విడ్డూరమన్నారు. నీటి పంపకాలపై తెలంగాణతో కలిసి పని చేస్తామని చెప్పారు.
మా భూభాగంలో గేట్లు ఎత్తుతామని చెప్పడం న్యాయమా, ధర్మమా అని ప్రశ్నించారు.

దేవినేని వర్సెస్ హరీష్ రావు

తాము పక్కనున్న కర్నాటక, మహారాష్ట్రతో స్నేహపూర్వకంగా వెళ్తున్నామని, ఏపీతో కూడా అలాగే వెళ్లాలనుకుంటున్నామని హరీష్ రావు అన్నారు. కానీ ఏపీ కలిసి రావడం లేదన్నారు. దీనిపై దేవినేని మాట్లాడుతూ... తాము తెలంగాణతో కలిసి పని చేసేందుకు సిద్ధమని, కానీ అదే వితండవాదం చేస్తోందన్నారు.

తమ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి రావాలంటే, ఏపీలోని ప్రాజెక్టులు అన్ని కూడా రావాలని హరీష్ రావు చెప్పారు. దేవినేని మాట్లాడుతూ.. తమ భూభాగం పరిధిలోని ఉన్న గేట్లు తెలంగాణ ఎత్తుతామని చెప్పడం విడ్డూరమన్నారు.

తెలంగాణకు రావాల్సిన నీటిని వదులుకోమని, అదే విధంగా ఏపీ చుక్క నీరు తమకు వద్దని హరీష్ రావు చెప్పగా, తమకూ తెలంగాణ నీటి చుక్క వద్దని దేవినేని అన్నారు.

తమకు ఒక్క పంటకు నీరు కావాలంటుంటే, ఏపీ మూడో పంట కోసం నీరు కావాలని చెప్పడం విడ్డూరమని హరీష్ రావు అనగా, విభజనతో మేమే కష్టాల్లో ఉంటే మూడో పంటకు అని చెప్పడం సరికాదని హరీష్ రావు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+