వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు.. సూపర్‌స్టార్ కృష్ణ మృతిపట్ల స్పందించిన ఏపీ, తెలంగాణా గవర్నర్లు

|
Google Oneindia TeluguNews

సూపర్ స్టార్ కృష్ణ నేడు ఉదయం తెల్లవారుజామున కన్నుమూసారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో నిర్వాహకుడిగా తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న కృష్ణ మరణం అటు సినీరంగాన్నే కాక రాజకీయ రంగంలోని ప్రముఖులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. ఇక ఇప్పటికే కృష్ణ మృతిపట్ల పలువురు సినీ రంగ ప్రముఖులు, రాజకీయ రంగ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

కృష్ణ పార్థివదేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.. తెలంగాణా సర్కార్ నిర్ణయం


తాజాగా తెలంగాణ ప్రభుత్వం సినీ నటుడు కృష్ణ పార్థివదేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ మేరకు అధికారులకు సూచనలు చేశారు. ప్రస్తుతం నానక్ రామ్ గూడ లోని కృష్ణ నివాసానికి ఆయన పార్థివ దేహం చేరుకుంది.

 నేడు సాయంత్రం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ పార్దివదేహం

నేడు సాయంత్రం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ పార్దివదేహం

రేపు మధ్యాహ్నం కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలపడంతో అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతికకాయాన్ని సాయంత్రం గచ్చిబౌలి స్టేడియం కి తరలించనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో కృష్ణ పార్ధివదేహాన్ని అభిమానుల సందర్శించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం అక్కడి నుండి రేపు ఉదయం పద్మాలయా స్టూడియోస్ కు తీసుకువస్తారు. ఆపై కొన్ని శాస్త్రోక్తంగా చేయాల్సిన కార్యక్రమాలను పూర్తిచేసి, మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వెల్లడించారు.

కృష్ణ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన ఏపీ గవర్నర్

కృష్ణ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన ఏపీ గవర్నర్

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా కృష్ణ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగంలో కృష్ణ అందించిన సేవలు మరువలేనివని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఆయన మరణం అత్యంత విచారకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుతున్నాను అని తెలిపారు. కృష్ణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

లెజెండరీ కృష్ణ మరణం గురించి తెలిసి బాధ పడ్డానన్న తెలంగాణా గవర్నర్

సూపర్ స్టార్ కృష్ణ మరణం పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలుగు లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను అన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబసభ్యులకు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు. తెలుగు లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారి హఠాన్మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు.

English summary
The Telangana CM ordered to perform Krishna's last rites with government honours. Authorities are making arrangements to this extent. Responding to the death of superstar Krishna, the governors of AP and Telangana expressed their condolences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X