నాగార్జున సాగర్‌ వద్ద ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ ఏడాది జులై పూర్తయ్యే నాటికే నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టానికి నీరు చేరుకుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత జులై నెలలో సాగర్ పూర్తి స్థాయిలో నిండిపోయింది. తాజాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద భారీగా నమోదవుతోంది. దీంతో నాగార్జునసాగర్‌ లో నీటిమట్టం క్రమంగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుత సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా.. ప్రస్తుతం 586.20 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జులై పూర్తయ్యే నాటికే నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టానికి నీరు చేరుకుంది. దీంతో తెలంగాణ మంత్రులు 14 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. జులైలోనే నాగార్జున సాగర్‌ నిండటం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో నాగార్జున సాగర్ ను సందర్శించిన తెలంగాణ మంత్రులు.. మొత్తం 8 గేట్లు 8 ఫీట్లు పైకి ఎత్తి 68 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.

Krishnamma Roars All 26 Crest Gates Lifted at Nagarjuna Sagar

ఈ మేరకు 10, 11, 12, 13, 14, 15, 16, 17 గేట్లు ఎత్తారు. ఈసారి మహారాష్ట్ర, కర్ణాటక సహా రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయానికి భారీగా ఇన్‌ ఫ్లో కొనసాగుతోంది. సాగర్ వద్ద కృష్ణమ్మ ఉరకలెత్తి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ పరవళ్లను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున సాగర్ లో జల సందడి నెలకొంది.

మరోవైపు శ్రీశైలం క్యాచ్ మెంట్ ఏరియాలో భారీ వర్షాల పడటం వలన శ్రీశైలం డ్యామ్ ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఓ సారి గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. తాజాగా వస్తోన్న వరద ప్రవాహాంతో 8 రేడియల్ క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి, నీటికి కిందకు వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+