రాజకీయాల్లోకి రాకముందు నాకు స్టేజ్ ఫియర్: కేటీఆర్, టాటాపై ప్రశంసలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టాటా గ్రూప్ అంటే నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరు అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం అన్నారు. కేపీహెచ్‌బీలో టాటా స్ట్రెవ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

రాజకీయాలలోకి రాకముందు తనకు స్టేజ్ ఫియర్ బాగా ఉండేదని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ చాలా అవసరమని చెప్పారు. టాటా గ్రూప్‌తో (టాటా స్టైవ్ డెవలప్‌మెంట్) తెలంగాణకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు.

యువతకు శిక్షణ, ఉపాధి కల్పన కోసం కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తిని కలిగిన దేశం మనదని, నైపుణ్యాలు ఉన్న యువశక్తి దేశాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రభుత్వంలో కలిసి పని చేయాలని ఈ సందర్భంగా టాటా స్ట్రైవ్‌ను కోరారు.

KT Rama Rao praises Tata Company

తెలంగాణకు వస్తా: ఉమా భారతి

మిషన్ కాకతీయ పనులు పరిశీలించేందుకు తాను తెలంగాణకు వస్తానని కేంద్రమంత్రి ఉమాభారతి సోమవారం నాడు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల పైన కేంద్రం ఇప్పటికే ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Minister KT Rama Rao praises Tata Company.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి