కేటీఆర్ బర్త్ డేకు పూలవర్షం: నీలాంటోళ్లు కావాలి.. మంచు లక్ష్మి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజున అభిమానులు అద్భుతమైన కానుక ఇచ్చారు. హైదరాబాద్‌లో మూడు ప్రత్యేక విమానాలతో పూల వర్షం కురిపించారు. మూడు విమానాలు వేర్వేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరాయి.

ట్యాంక్‌బండ్‌, తెరాస భవన్, సచివాలయంపై పూల వర్షం కురిపించాయి. పూలతో పాటు తెలంగాణ మ్యాప్‌ పోలివున్న కరపత్రాలపై కేటీఆర్‌ బొమ్మను ముద్రించి జారవిడిచారు. శంషాబాద్‌లో విమానాలు బయలుదేరే ముందు అభిమానులు కేటీఆర్‌ బర్త్‌డే కేక్‌ను కట్‌ చేశారు. పూల వర్షం కురిపించిన తర్వాత అదే విమానాల్లో శివార్లలోని అటవీ ప్రాంతాల్లో వివిధ రకాల విత్తనాలు చల్లారు.

 కేటీఆర్ ఆదేశాలు బేఖాతరు

కేటీఆర్ ఆదేశాలు బేఖాతరు

ఆదివారం కేటీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో.. ఆయన ఆదేశాలు బేఖాతరు చేస్తూ పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలో హైదరాబాదులో పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైదరాబాదులో బ్యానర్లు, ఫ్లెక్సీలు వద్దని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ తెరాస కార్యకర్తలు దానిని పట్టించుకోలేదని చెప్పవచ్చు. దీంతో కేటీఆర్ రంగంలోకి దిగారు.

 కేటీఆర్ ఆదేశాలతో ఫ్లెక్సీల తొలగింపు

కేటీఆర్ ఆదేశాలతో ఫ్లెక్సీల తొలగింపు

తనతో పాటు ఎవరి ఫొటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్లు ఏర్పాటు చేసినా తొలగించండన్న మంత్రి కేటీఆర్ తాజా ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఆదివారం కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు, ఆయన అనుచరులు, అభిమానులు ముందుగానే నగరంలో భారీగా ఏర్పాటు చేసిన ఫెక్సీలు, కటౌట్లను తొలగించారు.

కేటీఆర్ ఆదేశాలతో ఫ్లెక్సీల తొలగింపు

కేటీఆర్ ఆదేశాలతో ఫ్లెక్సీల తొలగింపు

శనివారం ఒక్కరోజే అక్రమంగా ఏర్పాటు చేసిన నాలుగు వేల ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లను తొలగించామని కమిషనర్‌ డాక్టర్‌ బీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తొలగించిన వాటిలో కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసినవే ఎక్కువగా ఉన్నాయి.

కేటీఆర్ ఆదేశాలతో ఫ్లెక్సీల తొలగింపు

కేటీఆర్ ఆదేశాలతో ఫ్లెక్సీల తొలగింపు

నిబంధనలు అతిక్రమిస్తు ప్లాస్టిక్‌ కవర్ల వినియోగిస్తున్నందుకు రూ.7.48లక్షలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినందుకు రూ.10.84 లక్షలు, చెత్త తగులబెట్టినందుకు రూ.20 లక్షలు, ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేసినందుకు రూ.4.09లక్షల జరిమానా వసూలు చేశామన్నారు. కొన్ని రోజులుగా 8,304 కటౌట్లు, 19,146 ఫ్లెక్సీలు, 38,259బ్యానర్లు, 63,824 పోస్టర్లు, 122 హోర్డింగ్‌లు తొలగించామన్నారు.

కేటీఆర్‌కు మంచు లక్ష్మి కితాబు

కేటీఆర్‌కు మంచు లక్ష్మి కితాబు

కేటీఆర్‌కు మంచు లక్ష్మి ప్రశంస తన పుట్టిన రోజున ప్లెక్సీలు వద్దని, వాటిని తొలగింప చేసిన మంత్రి కేటీఆర్ పైన నటి మంచు లక్ష్మి ప్రశంసలు కురిపించారు. కేటీఆర్ లాంటి లీడర్లు ఎంతోమంది అవసరమని పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister K.T. Rama Rao had earlier ordered the removal of all illegal political hoardings in the city, even if they had images of Chief Minister K. Chandrasekhar or himself.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి