సాయిరెడ్డి ఛైర్మన్ గా - కేటీఆర్ మెంబర్ గా : రాజకీయాలకతీతంగా - ప్రోత్సాహం కోరిన మంత్రి..!!

వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఛైర్మన్ గా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ మెంబర్ గా పాల్గొన్న సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏడున్నర సంవత్సరాలలోనే దేశంలో అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడంలో చొరవ చూపడం లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కామర్స్‌పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసారు. వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఛైర్మన్ గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ సమావేశం జరిగింది. సభ్యులుగా మంత్రి కేటీఆర్ తో పాటుగా పలు పారిశ్రామిక రంగ ప్రతినిధులు హాజరయ్యారు.

రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే

రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే

నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే వేగంగా అభివృద్ధి జరుగుతుందన్న విశ్వాసం తమకు ఉన్నదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని, ఏడున్నర సంవత్సరాలుగా తలసరి ఆదాయంతో పాటు జీఎస్‌డీపీ వంటి అంశాల్లో రెట్టింపు వృద్ధిని నమోదు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి వచ్చే సంపద దేశంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగం జరుగుతుందన్న అంశం తమకు గర్వకారణంగా ఉందని, అయితే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మరింత సహకారం అందించాలన్నారు.

కేంద్రం పట్టించుకోవటం లేదు

కేంద్రం పట్టించుకోవటం లేదు

తెలంగాణ ప్రభుత్వానికి దక్కాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్ నుంచి మొదలుకొని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నేషనల్ డిజైన్ సెంటర్, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల వరకు అనేక హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మేకిన్ ఇండియా నినాదం నిజరూపం దాల్చాలంటే కేంద్ర ప్రభుత్వం మరిన్ని పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే సాధ్యమవుతుందన్నారు. దేశంలోని సూక్ష్మ, మధ్యతరహా పారిశ్రామిక రంగానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

పార్లమెంట్‌ సాక్షిగా వచ్చిన విభజన హామీలతో పాటు వివిధ పథకాల కింద రావాల్సిన సహాయ సహకారాలను అందించాలని విజయసాయిరెడ్డిని కోరారు. ఈ-కామర్స్, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని కేటీఆర్ సూచించారు. ఈ-కామర్స్, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+