బీఆర్ఎస్‌లోకి రావాలంటూ కేటీఆర్, హరీశ్ రావు ఆహ్వానం: నాగం జనార్ధన్ రెడ్డి ఏమన్నారంటే?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు ఆదివారం సాయంత్రం నాగం జనార్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. భేటీ అనంతరం నేతలు మాట్లాడారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తరపున ఆయన సూచన మేరకు నాగం జనార్ధన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించినట్లు తెలిపారు. పార్టీలో వారికి, వారి అనుచరులకు సముచితస్థానం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్, నాగం చిరకాల మిత్రులు అని.. వారిద్దరిది 40 ఏళ్ల స్నేహం అని తెలిపారు. నాగం మొదటి నుంచి తెలంగాణవాది అని.. అందరం సమష్టిగా ఎన్నికల్లో కలిసి పనిచేస్తామన్నారు మంత్రి కేటీఆర్.

నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తనను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారని తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై.. ఆ తర్వాత ముహూర్తం నిర్ణయించుకొని బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతానని కార్యకర్తల సాక్షిగా తెలుపుతున్నానన్నారు నాగం. కాంగ్రెస్‌లో పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను కలిచివేశాయన్నారు.
పొద్దున పార్టీలో చేరిన వారికి టికెట్ ఇస్తుందని.. దాదాపు ఏళ్ల కొద్ది పార్టీ కోసం పని చేసిన వారికి గుండుసున్నా చూపిస్తున్నదంటూ మండిపడ్డారు. ఇవాళ తెలంగాణలో అభివృద్ధికి నాంది పలకాలని.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు అడ్డుకుంటారన్నారు. నాగర్ కర్నూల్ భవిష్యత్ కోసం బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు నాగం. కాంగ్రెస్ అధ్వాన్న స్థితిలోకి చేరిందని, చేవేళ్ల కాంగ్రెస్ సభకు 50వేల మందిని తరలించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మంత్రి @BRSHarish కలిశారు. హైదరాబాద్‌లోని నాగం నివాసంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ క్రమంలో నాగం జనార్దన్ రెడ్డిని మంత్రులు బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.… pic.twitter.com/mGNlkWPc5R
— BRS Party (@BRSparty) October 29, 2023
ఉదయ్‌పూర్ డిక్లరేసన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని నాగం విమర్శించారు. డబ్బులు ఉన్న వారికే కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని ఆయన దుయ్యబట్టారు. పార్టీ జెండాలు మోసిన వారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం లేదన్నారు. మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి పని చేస్తానన్నారు. మరోవైపు, నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్ అవమానించిందని మర్రి జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. నాగంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. నాగం జనార్దన్‌రెడ్డికి తాను కుమారుడి లాంటివాడనని అన్నారు.
సీఎం కేసీఆర్‌ను కలిసిన నాగం
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ప్రగతి భవన్‌లో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నాగం జనార్దన్‌రెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications