నల్గొండలో మళ్ళీ మేమేవస్తాం; ఐటీహబ్ ప్రారంభిస్తాం; ఐటీ హబ్ శంకుస్థాపన చేసిన కేటీఆర్ వరాల జల్లు
ఏడాదిన్నరలో నల్గొండలో ఐటి హబ్ ను ప్రారంభించి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని, మళ్లీ మేమే వస్తాం నల్గొండ ఐటీ హబ్ ను ప్రారంభిస్తాం అంటూ తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ నల్గొండ టౌన్ లో పాలిటెక్నిక్ కాలేజీ లో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ భవనాలను ప్రారంభోత్సవం చేశారు. ఐటీ హబ్ కు శంకుస్థాపన చేశారు. కేటీఆర్ తో పాటు ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లతోపాటు, ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి, భాస్కర్ రావు, భగత్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంపీ లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండలో ఐటీ హబ్ కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
ఐటి హబ్ కు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాలో ఐటీ హబ్, టాస్క్ సెంటర్ ను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఐటి సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నల్లగొండకు ఐటి హబ్ సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. 75 వేల చదరపు అడుగుల 750 మంది కూర్చునేలా నిర్మించబోయే ఐటి హబ్ లో 15 కంపెనీలు వస్తాయని 16 వందల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు గా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

నల్గొండ యువతకు ఉద్యోగాలు వచ్చేలా ఐటీ హబ్
హైదరాబాద్ తర్వాత ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీని అభివృద్ధి చేస్తున్నామని, అందులో భాగంగానే నల్గొండ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్ తో పాటుగా నల్గొండ యువతకు ఉద్యోగాలు వచ్చేలా ఐటీ హబ్ ఏర్పాటు జరుగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టాస్క్ పేరిట నల్గొండలోనేవిద్యార్థులకుస్కిల్స్ నేర్పించేలా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం అని పేర్కొన్న కేటీఆర్ నల్గొండలోనే వారికి అన్ని విధాలాప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. స్థానిక యువతపారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చూస్తామని చెప్పారు.

మళ్ళీ నల్గొండలో వచ్చేది మేమే .. అప్పుడే ఐటీ హబ్ ప్రారంభిస్తాం
ఖమ్మం, కరీంనగర్ లో ఇప్పటికే ఐటీ హబ్ లు ప్రారంభమయ్యాయని, ఉగాది లోపు నిజామాబాద్లో, అతి త్వరలో మహబూబ్ నగర్ లో ప్రారంభం కాబోతోందని పేర్కొన్నారు. రాబోయే 16 నుండి 18 నెలల్లో నల్గొండలో కూడా మళ్లీ మేమే వస్తామన్న కేటీఆర్ అప్పుడు ఐటీ హబ్ ను ప్రారంభిస్తాం అంటూ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరుగుతున్నదని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణా అన్ని రంగాల అభివృద్ధిలో దూకుడు
భారత దేశానికి ఎక్కువ ధాన్యం ఇచ్చిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని స్పష్టం చేశారు. కేసీఆర్ సమర్ధవంతమైన నాయకత్వం వల్లనే తెలంగాణఅన్ని రంగాల్లో అగ్రభాగాన దూసుకుపోతున్నదన్నారు. లోకల్ బాడీస్ ను ఏర్పాటు చేసి వాటికి ఐఎఎస్ అధికారులను నియమించి, పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేస్తున్నది కేసీఆర్ నాయకత్వం అని వెల్లడించారు. నెల నెల నిధులను మంజూరు చేస్తూ పల్లెలు,పట్టణాల్లో అభివృద్ధిపండుగ జరుగుతున్నదన్నారు. ఆర్బీఐ నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థ కు4 వ ఆర్ధిక చోదక శక్తి గా తెలంగాణ రాష్ట్రంవున్నదని వెల్లడించిందని, ఇది అందరికీ గర్వకారణం అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం .. జోడెద్దుల్లా
రాష్ట్రంలో అభివృద్ధి ,సంక్షేమము జోడెద్దుల్లాపరుగులు పెడుతున్నాయని, 24 గంటల ఉచితవిద్యుత్ ను రైతులకుఅందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు నల్గొండ లోఫ్లోరైడ్ ను పెంచి పోషించారని మండిపడ్డారు. మిషన్ భగీరథపథకం వల్లనేఫ్లోరైడ్ మహమ్మారి అంతం అయిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోమూడు మెడికల్ కాలేజీలను మంజూరు చేశామని, యాదాద్రి ఆలయం, యాదాద్రి పవర్ ప్లాంట్ ను నిర్మిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.

నల్గొండ టౌన్ లో 5 బస్తి దవాఖానలు మంజూరు
50 వేల కోట్లనురైతు బంధు పథకం ద్వారా రైతులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. నల్గొండ పట్టణానికి అన్ని హంగులు ఏర్పాటు చేస్తామని వెల్లడించిన కేటీఆర్ నల్గొండ టౌన్ లో 5 బస్తి దవాఖానలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని, వైకుంఠ ధామాలను , కబరిస్తాన్ లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 100 కోట్లతో నల్గొండ పట్టణంలో రోడ్ల ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. నల్గొండ లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ, ఓ పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications