ఢిల్లీలో కేటీఆర్ కీలక మంత్రాంగం - రేవంత్ అలర్ట్..!!

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారింది. లగచర్ల చుట్టూ ప్రస్తుతం రాజకీయం తిరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. లగచర్ల ఘటన పై వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. అటు లగచర్ల ఘటనలో జైలులో ఉన్నవారిని బీజేపీ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ దాడి తీవ్రతరం చేసారు. ఇక..కేటీఆర్ అరెస్ట్ ప్రచారం వేళ ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ రేవంత్ పై ఒత్తిడి పెంచుతోంది.

లగచర్ల దుమారం కొనసాగుతోంది. లగచర్లలో ప్రభుత్వం సంబంధం లేని వారి పైన కేసులు నమోదు చేసిందని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలు సైతం ఢిల్లీకి రావటంతో.. అక్కడ లగచర్ల బాధితులతో కలిసి సోమవారం ఉదయం జాతీయ మానవహక్కుల కమిషన్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, ఉమెన్‌ రైట్స్‌ కమిషన్‌ చైర్మన్లను కలిసి లగచర్ల ఘటనపై ఫిర్యాదు చేస్తున్నారు. లగచర్ల ఘటన గురించి ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ ను కేటీఆర్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత వారం ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ అమృత్ టెండర్లలో స్కాం జరిగిందని కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసారు.

KTR Delhi Tour in support of Lagacharla victims targets CM Revanth

లగచర్లలో బాధితుల సమస్య పట్టించుకోకుండా ప్రభుత్వం పోలీసుల సహకారంతో గిరిజన మహిళల పైన దాడులు చేస్తూ వారిని అక్రమంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ నేతలు జాతీయ కమిషన్ లకు ఫిర్యాదులు చేస్తున్నారు. బీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ సైతం లగచర్ల ఘటన పైన స్పందిస్తోంది. సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల గ్రామస్థులను బీజేపీ నేతలు పరామర్శించారు.

KTR Delhi Tour in support of Lagacharla victims targets CM Revanth

రేవంత్ ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. అయితే, లగచర్లలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే అధికారుల పైన దాడులకు కారణమైన వారిని గుర్తించి అరెస్ట్ చేసింది. మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావన కు రావటంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం సాగింది. అయితే, ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ కేంద్రంగా రేవంత్ ను ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, రానున్న రెండు రోజుల్లో లగచర్ల అంశం కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+