ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ అంటే..కేటీఆర్ కొత్త నిర్వచనం : దేశంలో చిచ్చు పెడుతున్నారు - అజయ్ కు మద్దతుగా..!!

|
Google Oneindia TeluguNews

దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేసారు. కేవలం కులం, మతం పేరుతో ఓట్లు దండుకునేందుకు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పచ్చగా ఉన్న దేశంలో చిచ్చు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. కొంత మంది విమర్శలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తుంటారంటూ వ్యాఖ్యానించారు. అదే విధ:గా ఒక కార్యక్రమంలో ఖమ్మంలో చేపట్టి..ఒక నేతను రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకొనేలా చేసారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

పువ్వాడను బాధ్యుడుని చేసే ప్రయత్నం

పువ్వాడను బాధ్యుడుని చేసే ప్రయత్నం

అంతటితో ఆగలేదని.. బట్ట కాల్చి మీదేసినట్లు ఆ నేత చావుకు మంత్రి పువ్వాడను బాధ్యుడిని చేసేందుకు ప్రయత్నించారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ హాయంలో జిల్లాలోని లకారం చెరువును ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. చెరువుపై నిర్మించిన తీగల వంతెనను చూసేందుకు నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వస్తున్నారని వివరించారు. ఇదే సమయంలో కేసీఆర్ కు కొత్త నిర్వచనం ఇచ్చారు. కేసీఆర్‌ అంటేనే నిలువెత్తు అభివృద్ధి అని.. కే అంటే కాలువలు.. సీ అంటే చెరువులు.. ఆర్ అంటే రిజర్వాయర్‌లు అని అభివర్ణించారు.

ఇలాంటి పరిస్థితులు ఎందుకు


ఖమ్మం నగరాన్ని నంబర్‌ వన్‌గా మార్చాలనేదే మంత్రి పువ్వాడ అజయ్‌ లక్ష్యమని చెప్పుకొచ్చారు. కొంత మంది నేతలు చేసిన వ్యాఖ్యల కారణంగా దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది భారతీయ ముస్లిం సోదరులు నిరసన వ్యక్తం చేసారని చెప్పారు. అసలు దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి కారణం ఎవరంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ దేశంలో పక్కవాళ్లని అనుమానంతో చూసే విధంగా పరిస్థితులు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

సవ్యమైన పద్దతుల్లో ముందుకు వెళ్తేనే

సవ్యమైన పద్దతుల్లో ముందుకు వెళ్తేనే

నేతలు ఇల్లు లేని పేదవాడి గురించి, నీళ్లు లేని గ్రామాల గురించి, పిల్లల ఉద్యోగాలు, కరెంటు లేని గ్రామాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పేద ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. స‌వ్య‌మైన ప‌ద్ధతుల్లో ముందుకు పోతేనే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌పంచంలో జ‌రుగుతున్న చ‌ర్చ గురించి అంద‌రూ ఆలోచించాలని సూచించారు. ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్‌గా చైనా ఎదిగింద‌న్నారు. ఇక్కడేమో కుల పిచ్చి, మ‌త పిచ్చి ఎక్కువైపోయిందని వ్యాఖ్యానించారు. దీంతో అభివృద్ధి అడుగంటి పోయిందని కేటీఆర్ చెప్పారు.

English summary
KTR serious comments on BJP politics in Khammam tour, appreciated Ajay kumar in Khammam Development..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X